Begin typing your search above and press return to search.
వెంకయ్య డబ్బా పురుషుడు..బాబు షో మ్యాన్
By: Tupaki Desk | 30 Dec 2016 7:30 PM GMTకేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు. పెద్దనోట్ల రదు అనంతరం సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని - దీనిపై ప్రధాని చెప్పిన 50 రోజులు పూర్తయినప్పటికీ కరెన్సీ కష్టాలు ఏమాత్రం తీరలేదన్నారు. కనీసం ఇప్పటికైనా ఇబ్బందులు సరిదిద్దే చర్యలు చేపట్టకుండా దీనివల్ల అద్భుత ఫలితాలు వస్తాయని - ప్రజలు హరిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య మొండిగా వాదించడం - మోడీ - చంద్రబాబులను చరిత్ర పురుషులుగా పొగడడం విడ్డూరంగా ఉందన్నారు. వారు చరిత్ర పురుషులో? కాదో? ప్రజలే తేలుస్తారు కాని వెంకయ్య మాత్రం డబ్బా పురుషుడిగా నిల్చిపోయారని రామకృష్ణ ఎద్దేవా చేశారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని వెంకయ్య నమ్మితే బహిరంగచర్చకు సిద్ధమా అని రామకృష్ణ సవాల్ విసిరారు. జన్ ధన్ ఖాతాల్లో కరెన్సీ ఇబ్బందులపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాల్సిన కమిటీ బాధ్యుడిగా ఉన్న చంద్రబాబు సైతం అటువంటి ప్రయత్నం చేయకుండా రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. షో మ్యాన్ వలే మారిపోయిన చంద్రబాబుకి ప్రచారం మీద ఉన్న శ్రద్ద రాష్ట్రాభివృద్ధి - ప్రజా సమస్యల పరిష్కారంలో లేదన్నారు. పోలవరం స్పిల్ వే పనుల ప్రారంభానికి భారీమొత్తంలో ఖర్చు పెట్టడమే ఇందుకు ఉదాహరణ అని రామకృష్ణ పేర్కొన్నారు. సహజంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం లేదా ప్రారంభించడం చూశాం కాని, అర్థపర్థం లేకుండా కాంక్రీటు పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ఓ పెద్ద ఉత్సవంలా నిర్వహించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన ఇలాగే చేశారని రామకృష్ణ గుర్తుచేశారు. తన స్వంత కుటుంబ వ్యవహారంలా భార్యాభర్తలు - కుటుంబసభ్యులతో కల్సి బొడ్డురాయికి ఒకసారి- రాజధానికి మరోసారి- పరిపాలనా భవనానికి ఇంకోసారి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రీతిలో పట్టిసీమ ఎత్తిపోతల విషయంలో సైతం కేవలం పబ్లిసిటీయే లక్ష్యంగా ప్రతి పంపుకో ప్రోగ్రాం పెట్టి డబ్బు దుబారా చేశారని రామకృష్ణ విమర్శించారు.
నిత్యం అమరావతి - పోలవరం జపం చేస్తూ మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదని రామకృష్ణ అన్నారు. దాదాపు 18 కిలోమీటర్ల టన్నెల్ లతో నిర్మితమవుతూ కరవు ప్రాంతాలకు నీరందించే దేశంలోనే అతిపెద్దదైన వెలుగొండ ప్రాజెక్టు పనులు బిల్లల చెల్లింపు నిల్చిపోయిన కారణంగా గత నాలుగైదు నెలలుగా సాగడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు. తాత్కాలిక సచివాలయం వద్ద కనీస సౌకర్యాలు లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలవారీగా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదని ఇవేమీ బాబుకు పట్టవా అని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఉరూ యూనివర్శిటీ మినహా మిగిలిన ఏ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సాక్షాతూ ఆజిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలకు స్వస్తి చెప్పి ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని కోరారు. విభజన హామీల్లో భాగంగా జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ వ్యయాన్ని పూర్తిస్థాయిలో కేంద్రం భరించాల్సి వుండగా అరకొర నిధులు విదిలిస్తోందన్నారు. అయినా ఎంతో గొప్పగా మహా అద్భుతం జరిగినట్లుగా చంద్రబాబు కేంద్రాన్ని ఆకాశానికెత్తడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/