Begin typing your search above and press return to search.
సీఎంను పట్టుకొని అవేం మాటలు కామ్రేడ్?
By: Tupaki Desk | 6 Feb 2020 4:30 PM GMTఏపీలో ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తాజాగా తాడికొండలో ఆయన రైతుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంత్రి బొత్స సత్యనారాయణలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకున్నా.. గీత దాటేశారు రామకృష్ణ. ముఖ్యమంత్రి జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలు.. ముక్కలుగా నరికేస్తారని.. అందుకే ఆయన పోలీసుల్ని అడ్డు పెట్టుకొని తిరుగుతున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో పాటు.. మంత్రి బొత్సను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒక గాడిద అమరావతిని శ్మశానం అంటాడు. వాడొక మంత్రి. పేరు బొత్స. ఇక్కడి ప్రజలకు భయపడి గుండు కొట్టించుకొని తిరుగుతున్నాడు. అమరావతి ప్రజలు శాంతిమూర్తులని.. యాభై రోజులైనా శాంతియుతంగా ఉద్యమిస్తున్నారన్నారు. అదే తమ రాయలసీమలో అయితే.. ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లమని నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. బాధ్యత కలిగిన ఒక పార్టీ కీలక నేతగా మాట్లాడాల్సిన దానికి భిన్నంగా ఆయన మాటలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మరిచి కామ్రేడ్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.