Begin typing your search above and press return to search.
జగన్ కేబినెట్ లో మగాళ్లే లేరు.. అంతా ఆడంగిలే
By: Tupaki Desk | 8 Jan 2020 4:06 PM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్లో ఉన్నవారంతా ఆడవాళ్లేనని.. ఒక్క మగాడూ లేడని అన్నారు. కేబినెట్లోని మంత్రులంతా చోద్యం చూస్తుండగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే జగన్ పతనం ప్రారంభమైనట్టేనని రామకృష్ణ అన్నారు. ‘రాజధాని ఉద్యమానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. విశాఖపై విజయసాయిరెడ్డి ప్రకటనలు చేస్తుంటే మంత్రులు ఇక ఉండి లాభమేంగి?, జగన్ కేబినెట్ లో మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. కేబినెట్ లో మాట్లాడే మగాడే లేడు. హైకోర్టును 3 ముక్కలు చేస్తే రాయలసీమ బాగుపడుతుందా? - రాయలసీమకు నీళ్లు ఇస్తే బాగుపడుతుంది. జగన్ కు ఇదే చివరి అవకాశం.. పద్ధతి మార్చుకోవాలి’ అని సూచించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి - ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి అనుకుని రాజధానిని మార్చేస్తే అయిపోతుందా.. ఇంకెవరి నిర్ణయం అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిని మారుస్తున్న విషయం కనీసం అయిదుగురు ఉప ముఖ్యమంత్రులకైనా తెలుసా అని నిలదీశారు రామకృష్ణ. జగన్ కేబినెట్లో ఉన్న మహిళా మంత్రులే కాదు పురుష మంత్రులు కూడా మహిళలతో సమానమేనని ఆయన అన్నారు.