Begin typing your search above and press return to search.

జగన్ హగ్గులన్నీ ఆ పార్టీకే.... పవన్ కి మాత్రం...?

By:  Tupaki Desk   |   11 Jun 2022 2:04 AM GMT
జగన్ హగ్గులన్నీ ఆ పార్టీకే.... పవన్ కి మాత్రం...?
X
రాజకీయాల్లో ప్రేమలు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ ఎర్రన్నలే బాగా చెప్పగలరేమో. ఎంత గొంతు చించుకున్నా ఏపీలో ఏర్పడబోయే ఏ కూటమిలో కూడా వారికి చోటు ఏంటో తెలియడంలేదు. దాంతో నిన్న సీపీఎం కామ్రేడ్ మధు ఘాటు విమర్శలు చేస్తే నేడు ఆయన సోదర కామ్రెడ్ సీపీఐ రామక్రిష్ణ కూడా అదే వరసలో తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు. ఏపీలో బీజేపీతో గుద్దులాట ఆడుతున్నట్లుగా చెవిలో పువ్వులు పెడుతున్న జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో లాలూచీ పడుతున్నారని హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీతో దోస్తీ లేకపోతే తన పరిస్థితి ఏమవుతుందో జగన్ కి బాగా తెలుసు అని సెటైర్లు వేశారు. ఆయనకు కేసులు ఒక వైపు ఉన్నాయి. మరో వైపు ప్రతీ నెలా ఒకటవ తేదీకి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉంది. అందుకే కేంద్రంతో తప్పనిసరి పరిస్థితులలో అంటకాగుతున్నారని నిందించారు. హగ్గులనీ బీజేపీకి ఇస్తూ ఇటు జనాలకు మాత్రం బాదుడే బాదుడు అంటూ నానా బాధలు పెడుతున్నారని రామక్రిష్ణ విమర్శించారు.

ఇక ఏపీ పాలిటిక్స్ లో మూడు పార్టీల మధ్య మూడు ముక్కలాట సాగడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పాపం పవన్ కళ్యాణ్ తాను బీజేపీతోనే ఉన్నాను, ఉంటాను అని ఎంత చెబుతున్నా బీజేపీ మాత్రం జగన్ తోనే ఉంటోందని ఆయన సరికొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీని బయటపెట్టారు. వైసీపీ మద్దతు బీజేపీకి కావాలి. వైసీపీ కూడా బీజేపీ మాట జవదాటే సీన్ లేదని ఆయన అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో డ్యామ్ ష్యూర్ గా బీజేపీకే వైసీపీ మద్దతు ఇస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. జగన్ కేంద్రం మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. 151 సీట్లు 175 ఎలా అవుతాయో జగనే చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలకు ఏమైనా విలువ ఉందా. వారు వట్టి నిమిత్తమాత్రులు. వారికి ఏ అధికారం లేదుగా. అన్ని నిర్ణయాలు తాడేపల్లి ప్యాలస్ నుంచే అమలవుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారని రామక్రిష్ణ లాజిక్ పాయింట్ తీశారు.

ఇక చూడబోతే జగన్నాటకం టోటల్ గా ఏపీ జనాలకు అర్ధమైందని, ఇక ప్రజలే వచ్చే ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు అని రామక్రిష్ణ చెప్పడం విశేషం. ఏపీ విభజన తరువాత 96 వేల కోట్ల అప్పుతో రాష్ట్రం ఏర్పడిందని, జగన్ దిగిపోయే నాటికి అది కాస్తా పది లక్షల కోట్ల అప్పుగా మారబోతోంది అని ఆయన జనాలు హడలెత్తే తీరున కొత్త జోస్యం చెప్పారు.