Begin typing your search above and press return to search.
చంద్రబాబును ఢిల్లీకి పిలుస్తున్న రామకృష్ణ, వెళ్తారా మరి?
By: Tupaki Desk | 28 Feb 2020 4:30 PM GMTఈ మధ్య కాలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెంట బాగా కనిపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికల సమయంలో, అంతకు ముందు ఐదు సంవత్సరాలూ చంద్రబాబును బాగా విమర్శించారు రామకృష్ణ. ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలూ- జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు అయ్యాకా - అమరావతి విషయంలో తెలుగుదేశం నేతలా చంద్రబాబు వెంట తిరిగారు ఈ కమ్యూనిస్టు పార్టీ నేత. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
కమ్యూనిస్టులకు మిగతా ప్రాంతాలు పట్టవా? అమరావతే కావాలా? క‌్యాపిటలిస్ట్ వ్యూహం వంటి అమరావతికి కమ్యూనిస్టులు ఎలా వత్తాసు పలుకుతున్నారు? అనే ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. అయితే వాటికి ఈ ఎర్రపార్టీ నేత సమాధానం చెప్పలేదు. చంద్రబాబు వెంట మరీ టీడీపీ నేతలా తిరుగుతున్నారని సొంత పార్టీ నుంచినే అసహనం వ్యక్తం అయ్యింది. అయినా రామకృష్ణ చంద్రబాబు కే ప్రాధాన్యతను ఇచ్చారు.
కట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాలని, కేంద్రంపై స్పందించాలని చంద్రబాబును కోరుతూ ఉన్నారు రామకృష్ణ. కేంద్రం పై పోరాడాలంటూ చంద్రబాబుకు పిలుపుని ఇస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ఢిల్లీ ప్రయాణానికి రెడీ కావాలని, అలాగే ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో కూడా కేంద్రం తీరును ఖండిస్తూ ఉన్నారు రామకృష్ణ. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. కేంద్రం పై పోరాటానికి రావాలంటూ చంద్రబాబును కోరుతున్నారు!
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోరాటానికి అంటూ బయల్దేరగలరా? బీజేపీని విమర్శంచగలరా? మోడీని మాటైనా అనగలరా? ఈ విషయాలపై అందరికీ అవగాహన ఉంది. అయితే కమ్యూనిస్టు నేతలు మాత్రం తమకేం తెలియనట్టుగా మాట్లాడుతుంటారు. రామకృష్ణ కూడా అలానే స్పందించారంతే! అని పరిశీలకులు అంటున్నారు.