Begin typing your search above and press return to search.
పవన్ పై విమర్శలు కాదు.. పని చేయండి!
By: Tupaki Desk | 11 Sep 2016 6:33 AM GMTప్రత్యేక హోదా అనే అంశం ఏపీలో సృష్టిస్తున్న రాజకీయ అలజడి అంతా ఇంతా కాదు. ఈ విషయంలో అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ - దానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు స్పందించిన విధానం, అనంతరం కాకినాడలో పవన్ కల్యాణ్ సభ పెట్టడం - జగన్ రాష్ట్ర బంద్ కు పిలుపివ్వడం ఇలా వరుసగా జరిగిన సంఘటనలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా పీక్స్ కి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో పవన్ పై విమర్శలు చేస్తున్న ఒకవర్గం బీజేపీ నేతలపైనా - టీడీపీ ఎంపీలపైనా సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించిన సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తాజా పరిణామాలపై మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం - రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేయని ఎంపీలు - రాజకీయ నాయకులు ఏమాత్రం సిగ్గు లేకుండా పవన్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్యాకేజీపై రకరకాల ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని విమర్శించారు. పాచిపోయిన లడ్డూలను వెంకయ్యనాయుడు - చంద్రబాబునాయుడు చెరొకటి పంచుకుని తింటున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో పవన్ పై రకరకాల విమర్శలు చేస్తున్న నాయకులు వీలైతే పోరాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి తప్ప పోరాడుతున్న వారిపై విమర్శలు చేయకూడదని సూచించారు. ఇకనుంచి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద నిరసన తెలుపుతామని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు.