Begin typing your search above and press return to search.
బాబుపై పవన్ తెగ అసంతృప్తితో ఉన్నాడట
By: Tupaki Desk | 4 Dec 2016 8:08 AM GMTగత ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణమైన జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారా? ఇప్పటివరకు ప్రజలపక్షాన అడపా దడపా గళం వినిపిస్తున్న పవన్ ఇకనుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమించనున్నారా? ఇందుకోసం కలిసివచ్చే వారితో పవన్ ముందుకు సాగనున్న ఈ క్రమంలో వామపక్షాలు సరైన జోడీగా భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
ఇటీవల హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో రామకృష్ణ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేవలం పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేశారే తప్పించి మీడియాతో ఈ ఇద్దరు నేతలు మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తమ భేటీ వివరాలను రామకృష్ణ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పలు సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన తాము పవన్ కళ్యాణ్ కు తెలియజేశామని చెప్పారు. టీడీపీ పరిపాలన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న జనసేన అధినేత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటూ విస్మయం వ్యక్తం చేశారని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర పరిపాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్త పరిచారని రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. త్వరలో మరోమారు సమావేశం అవుదామని పవన్-తాము నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. ప్రజల పక్షాన ఉద్యమించడం కోసం భావసారుప్యత గల పవన్‌తో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని రామకృష్ణ ప్రకటించారు.
ఇదిలాఉండగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నామ్ కే వాస్తీగా మారరని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు పోలీసులకు అప్పగించడంతో వారిదే పెత్తనం సాగుతోందని హోంమంత్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నేతలను అణిచివేయడం సరికాదని హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/