Begin typing your search above and press return to search.
లెఫ్ట్ - రైట్ కలిసిపోయి పోటీచేస్తాయట..!
By: Tupaki Desk | 5 March 2019 3:22 PM GMTలెఫ్ట్ పార్టీల కథ కంచికి చేరింది. ఎప్పుడో 1952 ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1995 వరకూ వామపక్ష పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాయి. సీపీఐ లేదా సీపీఎంలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తమ ఉనికిని చాటుకొని పదిలోపు సీట్లను దక్కించుకొని తమ వాణిని వినిపించేవి. కానీ ఇప్పుడు వామపక్షాల ఉనికే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీల ప్రాతినిధ్యం కరువైంది. మొన్నటి 2014 ఎన్నికల్లో ఒక్క వామపక్ష పార్టీ ఎమ్మెల్యే భద్రాచలం నుంచి రాజయ్య గెలిచి ఎర్రజెండాను రెపరెపలాడించారు..కానీ ఇప్పుడు జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఒక్కస్థానాన్ని కూడా లెఫ్ట్ పార్టీలు గెలుచుకోలేదు. దీంతో తెలంగాణలోనూ లెఫ్ట్ పార్టీ కనుమరగైపోయింది. ఏపీలోనూ గత ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. దీంతో వామపక్ష పార్టీలు తెలుగునాట అంతర్థానమయ్యాయని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.
2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సీపీఐ మహాకూటమిలో భాగస్వామి అయ్యి కాంగ్రెస్ తో కలిసి నడిచింది. సీపీఎం మాత్రం బీఎల్ఎఫ్ గా మారి ఒంటరిగా పోటీచేసింది. రెండూ బొక్కబోర్లాపడ్డాయి. ఏపీలో ఇదే సీపీఎం పవన్ జనసేన పార్టీతో కలిసి ముందుకు సాగుతోంది. ఇక సీపీఐ పరిస్థితి ఏపీలో ఏపార్టీతో వెళుతందనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉనికే లేకుండా పోయిన లెఫ్ట్ పార్టీలు ఇన్నాళ్లకు తప్పు తెలుసుకొని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీచేయడానికి నిశ్చయించుకున్నట్టు సమాచారం. నల్గొండ - అరకుతోపాటు నాలుగు ఎంపీ సీట్లలో సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేయాలని భావిస్తున్నారు. ఏపీ - తెలంగాణ మొత్తంలో కేవలం నాలుగు సీట్లలోనే తమకు బలం ఉందని.. అక్కడికే వామపక్షాలు పరిమితమైపోతున్నాయి. కనీసం ఒక్క ఎంపీసీటు అయినా గెలువకపోతామా..? మళ్లీ ఉనికి చాటకపోతామా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. చూడాలి మరి వామపక్షాల పరిస్థితి తెలుగు నాట ఏమవుతుందో..