Begin typing your search above and press return to search.

బాబు ఇత‌రుల‌కు ఒక నీతి..నీకు ఇంకో నీతా?

By:  Tupaki Desk   |   20 April 2018 2:29 PM GMT
బాబు ఇత‌రుల‌కు ఒక నీతి..నీకు ఇంకో నీతా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు దీక్ష‌పై వివిధ వ‌ర్గాలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలైన వైసీపీ, కాంగ్రెస్ స‌హా ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత‌లు సైతం బాబు దీక్ష‌లోని నిజాయితిని ప్ర‌శ్నించ‌గా...తాజాగా క‌మ్యూనిస్టు సీనియ‌ర్ నాయ‌కుడైన మ‌ధు చంద్ర‌బాబు దీక్ష‌ తీరును త‌ప్పుప‌ట్టారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేనానికి మ‌ద్ద‌తిచ్చారు. బీజేపీ, టీడీపీ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజమని ఆయ‌న పేర్కొన్నారు.

మిత్ర‌ప‌క్షంగా తాను కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌భావితం చేస్తాన‌ని చెప్పుకున్న చంద్రబాబు ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప ప్రత్యేకహోదా సాధించలేకపోయారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విభజన చట్టంలోని హామీల అమలులో చంద్రబాబు విఫలం అయ్యారని ఆరోపించారు. చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు కాలేదని, పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ ఒక్క హామీ ప్రస్తావన లేదన్నారు. హోదా కోసం వైసీపీ, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీ నేత‌లు పోరాటాలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఆరెస్టు చేసిందని గుర్తు చేశారు. బంద్ లు చేస్తే ప్రజలకు నస్టం జరుగుతుందని చంద్రబాబు అంటున్నారని.. అయితే ఆయన దీక్ష చేస్తే నష్టం జరగ‌దా అని ఆయ‌న సూటిగా ప్రశ్నించారు. కానీ హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుది అవకాశం వాదమని, ఆయ‌న‌దో దొంగ దీక్ష అని సీపీఎం నేత మ‌ధు విమర్శించారు. టీడీపీ దివాళ తీసిందని ఎద్దేవా చేశారు. హోదా కోసం విపక్షాలు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తుంటే..చంద్రబాబు ఇప్పుడు ఆందళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్రజల ఆందోళనలు, ప్రత్యేకహోదాను టీడీపీ పట్టించుకోలేదన్నారు. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలు దెబ్బతినడానికి కారణం అయ్యాయయని.. వీరి మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ ధర్మ పోరాట దీక్షకు టీడీపీ కార్యకర్తలదే తప్ప ప్రజల మద్దతు లేదని సిపిఎం మధు తేల్చిచెప్పారు.