Begin typing your search above and press return to search.
పరామర్శించడానికి వచ్చి పంచ్ వేసేశాడు
By: Tupaki Desk | 11 Oct 2015 7:44 AM GMTతమ అధినేత జగన్ దీక్షకు విపక్షాలన్నీ మద్దతు పలుకుతున్నాయని వైసీపీ అనుకుంటున్న తరుణంలో వారికి అనుకోని ఝలక్ తగిలింది.. సీపీఎం నేత మధు మర్యాద కోసం జగన్ ను పరామర్శించడానికి వచ్చి సరైన చురక అంటించి వెళ్లారు. దీంతో మధు తమకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చారో... వెటకారమాడడానికి వచ్చారో అర్థం కాక వైసీపీ నేతలు జుత్తు పీక్కుంటున్నారట.
గుంటూరు వద్ద జగన్ దీక్ష శిబిరాన్ని సీపీఎం మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు సందర్శించారు. జగన్ తో ఆ మాటా ఈ మాటా ఆడిన తరువాత ఆయన సడెన్ గా ''మాకు పోరాటాలే అజెండా... మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు'' అన్నారు. దీంతో జగన్ కు ఏమనాలో అర్థం కాలేదట. నోట మాట రాక కేవలం తలాడించి ఊరుకున్నారట. అయితే.. మధు కావాలనే అలా అన్నారని... అదేదో యథాలాపంగా అన్న మాట కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
జగన్ దీక్ష ప్రభావం కనిపించకుండా నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో వార్తల్లో ఉంటూ ప్రజలకు దీక్ష సమాచారం చేరకుండా బాగానే ప్లాన్ చేస్తున్న చంద్రబాబుపై జగన్ దీక్ష ప్రభావం లేకున్నా... మధు వ్యాఖ్యల ప్రభావం మాత్రం జగన్ పై ఉంటుంది. రాజధాని కోసం చంద్రబాబు భారీ కార్యక్రమాలు చేస్తూ... ప్రధానిని, ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొస్తున్న సమయంలో జగన్ దీక్ష ప్రభావం ఎంత ఉంటుందన్నది చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా పరామర్శించడానికి వచ్చిన సీపీఎం నేత పంచ్ వేసి వెళ్లిపోవడాన్ని మాత్రం జగన్, వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారట.