Begin typing your search above and press return to search.
ఎవరు కలిసినా కేసీఆర్ ఫ్రంట్ ముచ్చట్లే!
By: Tupaki Desk | 7 April 2018 3:41 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తన రాజకీయ చాణక్యానికి పదునుపెడుతున్నారు. సందర్భం ఏదైనా - నాయకులు ఇంకెవరైనా...తన ఫ్రంట్ గురించి చర్చిస్తున్నారు. ఇలా కీలక చర్చల్లో భాగంగా తాజాగా వామపక్ష నేతలను కేసీఆర్ ఫిదా చేసేశారు. గులాబీ దళపతి కేసీఆర్ పాలన అంటే విరుచుకుపడే వామపక్ష నేతలు ఆయన సహాయాన్ని అర్థించగా...ఆ సమయంలోనూ కేసీఆర్ తన ఆలోచనలను పంచుకోవడం గమనార్మం.
వివరాల్లోకి వెళితే... ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో సీపీఎం పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు - తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సభకు కేరళ సీఎంతో పాటు పశ్చిమబెంగాల్ - త్రిపుర మాజీ ముఖ్యమంత్రులు - ఇతర జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారని వివరించారు. ఈ సభలకు ప్రభుత్వం నుంచి సహాయ - సహకారాలు కావాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ - సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేయగా... ముఖ్యమంత్రికి సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ - రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రకటించి, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా - ఇంకా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిఎం చెప్పారు. పరిష్కరించదగిన సమస్యలు కూడా అపరిష్కృతంగానే ఉండడం పాలకుల వైఫల్యమే అని సిఎం అన్నారు. ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ - బిజెపిలు సరైన విధానం అవలంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిఎం అన్నారు. కేసీఆర్ అభిప్రాయాలతో సిపిఎం నాయకులు ఏకీభవించారు. దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు రావడానికి ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న చొరవను వారు అభినందించారు. తప్పకుండా మార్పు రావాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాగా, తనపై నిత్యం విరుచుకపడే వారితో కూడా తన ఆలోచనలను మెచ్చుకునేలా చేయడం కేసీఆర్ సొంతమని అంటున్నారు.