Begin typing your search above and press return to search.
మీటింగుకు వెళ్లి అడ్డంగా బుక్కయిన కామ్రేడ్
By: Tupaki Desk | 3 Jun 2017 12:13 PM GMTఆరెస్సెస్... కమ్యూనిస్టులు. రెండూ రెండు భిన్న ధ్రువాలు. అలాంటప్పుడు ఆరెస్సెస్ మీటింగుకు కమ్యూనిస్టు నేతలు వెళ్తే ఏమవుతుంది... అందులోనూ కేరళలో... నిత్యం రెండు వర్గాలూ కొట్లాడుకుంటున్న రాష్ట్రంలో ఇలా జరిగితే ఏమవుతుంది. అలాంటివారిపై యాక్షన్ తీసుకుంటుంది. కేరళలోని ఓ కమ్యూనిస్టు నేతకు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురుకానుంది. అయితే.. ఆయేన మాత్రం లోకల్ లీడర్లు తనను మాయచేసి ఈ సమావేశానికి తీసుకెళ్లారని, తనకేమీ తెలియదని గగ్గోలు పెడుతున్నారు.
కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యే కేయూ అరుణన్ ఊహించని రీతిలో చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తన సొంత జిల్లా త్రిస్సూర్లో జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇంకేముంది... అది కాస్తా వివాదమై కూర్చుంది. దీంతో అరుణన్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర సీపీఎం నాయకులు అంటున్నారు.
అరుణన్ గత నెలలో స్థానిక నేతల ఆహ్వానం మేరకు ఆర్ఎస్ ఎస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఈ వ్యవహారంపై పెద్దగా ఎవరూ దృష్టి సారించనప్పటికీ.. మీడియాలో దీనిపై కథనాలు రావడంతో పార్టీ నాయకత్వం వరకు విషయం వెల్లింది. దీంతో ఎమ్మెల్యే అరుణన్ వివరణ కోరారు. స్థానిక నాయకులు తప్పుదోవ పట్టించారని ఆయన చెప్పినప్పటికీ పార్టీ నాయకత్వం మాత్రం దాంతో సంతృప్తి చెందలేదు. అరుణన్ ఇరింజల్ కుందా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేరళలో కొద్దికాలంగా సీపీఎం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/