Begin typing your search above and press return to search.
లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ?
By: Tupaki Desk | 2 April 2017 4:40 PM GMTప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నుంచి గెలిచిన వారిని పార్టీ పిరాయింపచేయడమే కాకుండా అలా వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించడం, పైగా రాజీనామా చేయించకుండా ఉండటంపలువురు విస్మయం వ్యక్తం చేశారు. సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు స్పందిస్తూ చంద్రబాబు తీరును తప్పుపట్టారు. బాబు తనయుడు లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని రాఘవులు అన్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవి పోయిన వారు అసమర్థులు అవుతారా అని ప్రశ్నించారు. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు సమర్థులా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసింది న్యాయమా అని రాఘవులు ప్రశ్నించారు. ఒకే నాయకుడు రెండు చోట్ల రెండు మాటలు మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సైతం బాబు తీరును తప్పుపట్టారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని జేపీ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు పోతాయని రాజ్యాంగం చెబుతోందని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చాలా దారుణమైన రాజ్యాంగ ఉల్లంఘన అని జేపీ ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలు చేయడం పోయి, ఉల్లంఘించే స్థాయికి ఈరోజు పరిస్థితి వచ్చిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. పార్టీని కుటుంబ ఆస్తిగా, ప్రభుత్వాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయని మండిపడ్డారు.