Begin typing your search above and press return to search.
చేగువేరా భక్తుడు తుపాకీ పడతాడా?
By: Tupaki Desk | 13 Sep 2016 8:31 AM GMTపవన్ కల్యాణ్ అంటే ఆయన సినిమా హీరోగా ఎంతగా ఖ్యాతి ఉందో.. చేగువేరా భక్తుడిగా కూడా అంత ఖ్యాతి ఉంది. ప్రత్యేకించి చేగువేరాను అభిమానించే ప్రతి ఒక్కరికీ పవన్ తమ జాతి మనిషే అనే సంగతి తెలుసు. పైగా తెలుగు రాష్ట్రాల్లో చేగువేరా ను తెలియని కుర్రకారు ఎవరైనా ఉంటే.. అలాంటి వారికి పవన్ తన సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ లో ఆయన ఫోటో వాడడం ద్వారా అంతో ఇంతో అవగాహన కల్పించాడు. అలాంటి పవన్ కల్యాణ్ .. ఇప్పుడు స్వయంగా తాను కూడా ప్రజా సమస్యల మీద పోరాటానికి ఉద్యమిస్తున్నాడు.
అయితే ఆయన ఉద్యమంలో చేగువేరా బాటను ఎంపిక చేసుకుంటాడా లేదా.. తనకంటూ సొంత మార్గాన్ని సృష్టించుకుంటాడా అనేది ఆసక్తికరమైన అంశం. ఈ విషయం మీదనే.. సీపీఎం నాయకుడు రాఘవులు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పవన్ - చేగువేరా భక్తుడు కావడం సంతోషకరమైన విషయమే అని.. అయితే చేగువేరా తాను సాధించదలచుకున్న లక్ష్యం కోసం తుపాకీ పట్టుకుని పోరాడాడని మరచిపోకూడదని చెప్పారు.
పవన్ తుపాకీ పట్టుకోవాలని తాము కోరడం లేదు గానీ.. కేవలం మాటలకు పరిమితం కాకుండా, కార్యరంగంలో ఉండాలని, ఆయన సభలకు పరిమితం కాకుండా క్రియాశీలంగా ప్రయత్నం చేస్తే.. ప్రత్యేకహోదాను సాధించవచ్చునని అన్నారు. మరి పవన్ కల్యాణ్ తాను ఆరాధించే చేగువేరా లాగా లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధమేనా? కేవలం సభలు మాత్రమే కాకుండా.. తాను అనుకున్న ప్రత్యేకహోదా దక్కేవరకు ఆయన జనం మధ్య ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఆయన మాత్రమే జవాబు చెప్పగల ప్రశ్న అని జనం అనుకుంటున్నారు.