Begin typing your search above and press return to search.
విశాఖ లో మరో ఘోర విషాదం.. క్రేన్ కూలి 10 మంది దుర్మరణం
By: Tupaki Desk | 1 Aug 2020 3:00 PM GMTవిశాఖ పట్నం జిల్లాలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఈ రోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోడ్ టెస్టింగ్ చేస్తుండగా..భారీ క్రేన్ బెర్త్ పై కూలిపోయింది. అకస్మాత్తుగా ఒక్కసారిగా భారీ క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది. లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా అదిక్రేన్ లో ఎదో లోపం ఏర్పడింది. దీనితో కొంత మంది క్రేన్ ను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఇలా వారు క్రేన్ ను పరిశీలిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా క్రేన్ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో దాని కింద ఉన్న కార్మికులు పక్కకి పరుగెత్తే సమయం కూడా లేకుండాపోయింది. ఇప్పటికే 10 మంది చనిపోయారు, అలాగే గాయపడిన కొందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిస్త అందిస్తున్నారు.
ప్రస్తుతం క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. విరిగిపడిన క్రేన్ కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, షిప్ యార్డు బయట ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే యార్డుల పనిచేస్తున్న సిబ్బంది బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమ వారు లోపల ఎలా ఉన్నారోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుల తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. ఇకపోతే , ఈ భారీ క్రేన్‌ను పదేళ్ల కిందట హిందుస్థాన్ షిప్‌యార్డ్ కొంది. దీని నిర్వహణను ఈమధ్యే పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చారు.
ఇక ఈ ఘటన పై సీఎం జగన్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ను తక్షణ చర్యలకు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక షిప్ యార్డు ప్రమాదంలోని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.