Begin typing your search above and press return to search.
చంద్రుడు పుట్టుక గుట్టు లెక్క తేలిపోయింది
By: Tupaki Desk | 30 Jan 2016 10:30 PM GMTచందమామ పుట్టుక గుట్టు లెక్క బయటకు వచ్చింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాలు.. సిద్ధాంతాలు తప్పని తేలిపోయి.. చంద్రుడి జన్మరహస్యం ఏమిటన్నది తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు గ్రహాల నేరుగా ఢీ కొనటం ద్వారానే చంద్రుడు పుట్టినట్లుగా తేలింది. దీనికి సంధించి శాస్త్రవేత్తలు చెబుతున్న లెక్క కాస్త చిత్రంగా.. మరింత ఆసక్తికరంగా ఉంది.
భూమి పుట్టిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడి పుట్టుక జరిగిందని లెక్క కడుతున్నారు. దీని ప్రకారం భూమి పుట్టినప్పుడు చంద్రుడు లేడని తేల్చారు. భూమి పుట్టిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత (ఇప్పటికి సుమారు 4.5 కోట్ల ఏళ్ల కిందటగా భావిస్తున్నారు) థియో అనే పిండస్థ గ్రహానికి మధ్య యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
థియో గ్రహం వచ్చి నేరుగా భూగ్రహాన్ని ఢీ కొనటంతో.. పెను ప్రళయం ఉద్భవించి.. అందులో నుంచి చంద్ర గ్రహం పుట్టుకొచ్చినట్లుగా తేల్చారు. దీని ముందు ఉన్న వాదన ప్రకారం.. భూమితో థియో గ్రహం 45 డిగ్రీల లేదంటే అంతకంటే ఎక్కువ కోణంలో ఢీ కొనటం వల్ల చంద్రుడు పుట్టినట్లుగా భావించినా.. తాజాగా చేపట్టిన పరిశోధనల ప్రకారం నేరుగా ఒకటికొకటి ఢీ కొనటం వల్లనే చంద్రుడి పుట్టుకకు కారణంగా లెక్క తేల్చారు. చంద్రుడి నుంచి సేకరించిన ఏడు శిలలపై పరిశోధన జరిపిన అనంతరం తాజా వాదనను వినిపిస్తున్నారు. ఈ ఢీ చోటు చేసుకున్న తర్వాత థియో గ్రహం కనుమరుగు అయిపోతే చంద్రుడు ఏర్పడ్డాడు. ఒకవేళ అలాంటి పరిణామం చోటు చేసుకోకుంటే వెన్నెల కురిపించే చంద్రుడి స్థానంలో పూర్తిస్థాయిలో ఉండే థియో గ్రహం కనిపించేదన్న మాట. అదే జరిగి ఉంటే.. భూగ్రహం ఎలా ఉండేదో..?