Begin typing your search above and press return to search.
`క్రేజీ కపుల్ః ఒంటి నిండా పచ్చబొట్లు.. నెత్తిన కొమ్ములు.. ముక్కు, వేళ్ల కత్తిరింపు!
By: Tupaki Desk | 18 July 2021 6:39 AM GMTఈ సమాజం ఎలా బతుకుతుందో తెలుసా మీకు? తన కోసం బతకదు. పక్కవాళ్ల కోసం జీవిస్తుంది. అంటే.. ఇతరులను ఆదుకునేందుకో, వాళ్లకు సేవ చేసేందుకో బతుకుతుందని పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో! అంతసీన్ లేదు. వాళ్లంతా కలిసి వీళ్లను తోపు అని మెచ్చుకోవాలన్నమాట. వీళ్లు కేక అని డప్పు కొట్టాలన్నమాట. వీళ్లు ఎంత గొప్పవాల్లో అని పొగడాలన్నమాట. ఈ ప్రపంచంలోని 99.99 శాతం మంది బతికేది ఇలాగే. ఇది శృతిమించిన వాళ్లు ఒకరకమైన సైకలాజికల్ డిజార్డ్ లోకి మారిపోతారు. తమని తాము ప్రత్యేకం అని ఎప్పటికప్పుడు చాటుకోకపోతే.. వాళ్లకు నిద్ర పట్టదు. వాళ్లు ప్రశాంతంగా బతకలేరు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జంట కూడా ఈ కోవకు చెందినదే.
ఈ పైత్యం ముదిరిన జంట బ్రెజిల్ దేశానికి చెందినది. భర్త పేరు మైఖేల్ ఫారో డో ప్రదో. భార్య పేరు కరోల్. జనాలు తమను స్పెషల్ గా గుర్తించాలని వీరు చేసే ప్రయత్నాలు, ఇప్పటి వరకు చేసిన పనులు చూస్తే.. ‘‘ఓర్నీయమ్మా బడవా.. ఇదేందయ్యా ఇదీ..? నేనెక్కడా చూడ్లే’’ అని అనుకోవాల్సిందే. మరి, అంతగా వీళ్లేం చేశారో చూద్దాం.
‘పచ్చబొట్టేసిన పిల్లగాడా/పిల్లదానా’ అనిపించుకోవడానికి జనాలు ఎంతగానో తాపత్రయ పడుతుంటారు. గతంలోనైతే చేతుల మీద ఇష్టమైన వాళ్ల పేర్లు రాయించుకునేవారు. ఆ తర్వాత కాలంలో అది గుండెల మీదకు చేరింది. ఇప్పుడు.. అదో రోగం మాదిరిగా ఒళ్లంతా పాకడం మొదలు పెట్టింది. చేతుల నిండా, ఒళ్లంతా టాటూలు వేయించుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సాధారణ జనం వరకు చేతుల నిండా.. ఒళ్లంతా పిచ్చి పిచ్చిగా టాటూలు వేయించుకొని రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. వీళ్లిద్దరూ మాత్రం అలాంటి వాళ్ల బాప్ అనిపించేందుకు సాక్ష్యాలే పై ఫొటోలు. ఈ ఫొటోను చూస్తే.. ఇదేదో ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ మాదిరిగా ఉంది కదా? కానీ.. అది పెయింటింగ్ కాదు. వాళ్లు నిజమైన మనుషులు. ఆ ఫొటోను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో ఇద్దరు మగాళ్లు ఉన్నారు కదా. వాళ్లిద్దరూ వేర్వేరు కాదు. ఇద్దరూ ఒక్కరే. ఆ పక్కన ఉన్న మహిళ మాదిరిగా ఉంది చూశారూ.. ఆవిడే ఆయన ఆవిడ.
ఇక, మొదటి ఫొటోలో ఆ మనిషికి ఉంగరపు వేలు లేదు గమనించారా? పుట్టుకతో అలా వచ్చిందని అనుకుంటున్నారా? లేదంటే.. ప్రమాదంలో పోయిందని అనుకుంటున్నారా? అదేం కాదు.. ఇతగాడే వెరైటీగా కనిపిద్దామని కత్తిరించుకున్నాడు. ఏంటీ షాకయ్యారా! దీనికేనా..? ఇంకా చాలా ఉన్నాయి. అతని వేలు కత్తిరించుకున్న చెయ్యిపైన చూడండి.. పెద్ద పెద్ద బొడిపెలు ఉన్నాయి. అవి కూడా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇక, నోటిని పరిశీలించండి. పక్కన రెండు కోరలు ఉన్నాయి కదా.. అవి కూడా పర్మనెంట్ గా కుట్టించుకున్నాడు. అవి వెండితో తయారు చేసినవి!
ఇక రెండో ఫొటో వద్దకు వచ్చేయండి. ఇందులో పైన జుట్టుకు ఏదో రంగు వేసుకున్నాడు. అది ఇవాళ రేపు అందరూ వేయించుకుంటున్నారు. కానీ.. వాటి పక్కన తెల్లగా ఏవో రెండు పిలకలు ఉన్నాయి చూడండి. అవి ఏంటో తెలుసుగా? యముడి దగ్గర్నుంచి వచ్చే యమభటులకు ఉండే కొమ్ములే అవి. ఇవి పెట్టి తీసేటివి అనుకుంటున్నారేమో..? అదేం కాదు. పర్మనెంట్. ఆపరేషన్ చేయించుకొని తగిలించుకున్నాడు. ఇంకా స్త కిందకు వస్తే.. ఆ ముక్కేదో తేడాగా ఉన్నట్టు ఉంది కదా! అది నిజమే. ఆ ముక్కును వెరైటీ లుక్ లో భాగంగా కోసి పడేశాడు! దాని కిందనే ఉన్న నోట్లో కూడా ఈ క్రియేటివిటీని వాడాడు. ఈ ఫొటోలో కనిపించట్లేదుగానీ.. నాలుకపైనా ప్రయోగం చేశాడు.
తెలుగు సినిమా ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ నాలుకపై, బొడ్డు మీద పూసలు కుట్టించుకుంది కదా.. దానికి అప్ గ్రేడెడ్ వర్షన్ గా ఇతగాడు.. నాలుకును రెండుగా చీల్చుకున్నాడు. మరి, తినడం, మాట్లాడడం సంగతేంటని అడక్కండి. అది కూడా వెరైటీలో భాగమే. ఇతగాడికి ఈ పిచ్చి ఎలా అబ్బిందో తెలుసా? ఇంకెవరు? మగాడి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి భాగస్వామికి గాక మరెవరికి ఉంటుంది చెప్పండి? ఈ పక్కనున్న భార్యే అతడిని ఇలా మార్చేసింది. ఈమె.. ‘‘బాడీ మోడిఫికేషన్’’లో నిపుణురాలు. ఈమె వ్యవహారం కూడా తక్కువేం లేదుకదా.. ముందు ఈమె మునిగిపోయి.. ఆ తర్వాత మొగుడిని దింపేసిందన్నమాట.
ఇదేం వెర్రి అనుకుంటున్నారా? స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా.. జనం నోటితో వెరైటీ అనిపించుకోవడంలో భాగమే ఇదంతా. సూపర్బ్, కేక, తొక్క, తోలు అని పిలిపించుకోవడానికే ఈ వేలం వెర్రి అంతా. ఇలాంటి వాళ్లు మన చుట్టూ ఉంటారు. ఉండడమేంటీ.. ముందుగా చెప్పినట్టు ప్రపంచం మొత్తం బతికేది ఇలాగే కదా? కాకపోతే.. డిగ్రీస్ లో తేడా. కొందరు తక్కువ. మరికొందరు ఎక్కువ. మైఖేల్ ఫారో డో ప్రదో, ఆయన భార్య పేరు కరోల్ ఇలాంటి వాళ్లుండే యూనివర్సిటీకి ప్రిన్సిపాల్స్ అన్నమాట. వీళ్లు చేసుకున్న ఈ మార్పును హ్యూమన్ సైతాన్ అని పిలుస్తారు. అంటే.. మనిషిరూపంలోని దెయ్యం అన్నమాట. ఈ రూపంలో అందరిచేతా దెయ్యం అని పిలిపించుకోవడానికే వీళ్లు ఇలా తయారయ్యారు. అదీ.. వీళ్ల వెరైటీ సంగతి. ఎలా ఉందీ..?