Begin typing your search above and press return to search.

వైరల్: క్రేజీ దీపావళి సెలబ్రేషన్! 1000 వాలా చుట్టిన కారును పేల్చాడు.. తర్వాత ఏమైందంటే!

By:  Tupaki Desk   |   26 Oct 2022 11:40 AM GMT
వైరల్: క్రేజీ దీపావళి సెలబ్రేషన్! 1000 వాలా చుట్టిన కారును పేల్చాడు.. తర్వాత ఏమైందంటే!
X
వెర్రి వేయి విధాల అంటారు. పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలోనూ ఈ వెర్రిచేష్టలు కొందరు చేస్తున్నారు. దీపావళికి 1000 వాలాలు పేల్చి గల్లీ అందరినీ షేక్ చేసే కొంటెగాళ్లు ఎందరో ఉంటారు. కానీ ఏకంగా కారుకు 1000 వాలా చుట్టేసి పేల్చాడు. పుసుకున్న కారు ఇంజిన్ లో.. ట్యాంకు లో కనుక ఈ టాపాసులు పడితే ఆ కారు మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయ్యేది. ఈ చెత్త కొత్త ఐడియా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్నేళ్లలో దీపావళి బాణాసంచా వేడుకల్లో ఇలాంటివి ఎవరూ ట్రై చేయలేదనే చెప్పాలి. ఇప్పటికే అనేక జోకులు , మీమ్స్ చూశాము. దీపావళిని పటాకులతో జరుపుకోవడంలో ప్రతి ఒక్కరూ తమదైన క్రియేటివిటీని జోడించి వీడియోలు విడుదల చేస్తారు.

ఒక యూట్యూబర్ తన హ్యాచ్‌బ్యాక్ కారుకు 1000-వాలాతో టాపాసులను చుట్టి రిమోట్‌ని ఉపయోగించి దానిని పేల్చాడు. ఆ పేలుళ్లను రికార్డ్ చేయడానికి కారు లోపల ఒక కెమెరాను.. కారు సమీపంలో కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్‌ వైరల్‌ అవుతోంది.

యూట్యూబ్ లో వ్యూస్ కోసం కారును పాడు చేయడం అతనికి పిచ్చికి నిదర్శనం అని చాలా మంది కామెంట్ చేశారు.,చాలా మంది ప్రజలు కొత్త తరం దీపావళి వేడుకలను ఆనందిస్తూ అభినందించారు..

త్రివిక్రమ్ అరవింద సమేత టార్చ్‌బేరర్‌లోని డైలాగ్‌ను ట్విట్టర్ వినియోగదారు సరదాగా గుర్తు చేసుకున్నారు, 'ప్రతి ముప్పై సంవత్సరాలకు జీవితాన్ని చూసే విధానం మారుతుంది. సినిమా నిర్మాతలు దీనిని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు దీనిని ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు దీనిని ఒక యుగం అంటారు.. సామాన్యులు దీనిని ఒక తరం అంటారు. కానీ ఆ మొదటి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒకరు ఉంటారు.

అతను టార్చ్ బేరర్. ఇక్కడ ఉన్న ఈ టార్చ్ బేరర్ పటాకులను కారు చుట్టూ చుట్టి వెలిగించాడు'అంటూ అదిరిపోయే కామెంట్లను ఈ వీడియో కింద చేశారు. మీరు వీడియో చూస్తే, అతను అక్షరాలా కార్లను వెలిగించే టార్చ్ బేరర్ అని అనిపించక మానరు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.