Begin typing your search above and press return to search.

క్రేజీ అప్డేట్ః జ‌లుబుతో క‌రోనా పీడ విర‌గ‌డ‌!

By:  Tupaki Desk   |   24 March 2021 3:30 AM GMT
క్రేజీ అప్డేట్ః జ‌లుబుతో క‌రోనా పీడ విర‌గ‌డ‌!
X
ప్ర‌పంచంలో క‌రోనా సృష్టించిన విల‌యం గురించి చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు బ‌లిగొన‌డం నుంచి.. దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్నాభిన్నం చేయ‌డం వ‌ర‌కు చేయాల్సిన న‌ష్టాల‌న్నీ చేసింది. వైర‌స్ ను అంత‌మొందించేందుకు ఆయా దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ కూడా సిద్ధం చేశారు. అయితే.. వాటి ప్ర‌భావం ఎంత‌న్న‌ది మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే.. ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఓ ప‌రిశోధ‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాన్ని వెలువ‌రించింది. క‌రోనాకు జ‌లుబు వైర‌స్ తో చెక్ పెట్టొచ్చ‌ని తేల్చింది!

రైనో అనే వైర‌స్ జ‌లుబుకు కార‌ణం అవుతుంది. ఆ వైర‌స్ కు, క‌రోనా వైర‌స్ కు పోటీపెట్టారు శాస్త్ర‌వేత్త‌లు. అయితే.. ఈ పోటీలో జ‌లుబు వైర‌స్ నెగ్గ‌డం విశేషం. ఈ రెండు వైర‌స్ లూ మ‌నిషి శ్వాస‌కోశంపై దాడిచేస్తాయ‌ని తెలిసిందే. ఇందుకోసం శాస్త్ర‌వేత్త‌లు శ్వాస‌కోశ క‌ణ‌జాలాన్ని సిద్ధంచేసి, దానిపై ఈ రెండు వైర‌స్ ల ను వ‌దిలారు.

ఈ క‌ణ‌జాలాన్ని దెబ్బ‌తీసేందుకు ఈ రెండు వైర‌స్ లు పోటీప‌డ‌గా.. ఇందులో జ‌లుబు వైర‌స్ విజ‌యం సాధించింది. క‌ణ‌జాలాన్ని ముందుగా రైనో వైర‌స్ దెబ్బ‌తీసింది. అయితే.. మ‌రోవిధంగానూ సైంటిస్టులు టెస్ట్ చేశారు. శ్వాస‌కోశ క‌ణ‌జాలంపై ముందుగా క‌రోనా వైర‌స్ ను వ‌దిలి ఒక రోజు మొత్తం దానికి అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత జ‌లుబు వైర‌స్ ను వ‌దిలారు. ఈ సారి కూడా రైనో వైర‌స్సే గెలిచింది. దీంతో.. జ‌లుబు వైర‌స్ ను క‌రోనా త‌ట్టుకోలేద‌ని నిపుణులు తేల్చారు.

అయితే.. జ‌లుబు కొంత‌కాల‌మే ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అది త‌గ్గిపోగానే.. మ‌ళ్లీ క‌రోనా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు శాస్త్రవేత్త‌లు. అయితే.. క‌రోనా నివార‌ణ‌కు కృషి చేస్తున్న ప‌రిశోధ‌న‌లకు ఈ అధ్య‌య‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. ప్ర‌పంచంలో క‌రోనా సృష్టించిన విల‌యం గురించి చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు బ‌లిగొన‌డం నుంచి.. దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్నాభిన్నం చేయ‌డం వ‌ర‌కు చేయాల్సిన న‌ష్టాల‌న్నీ చేసింది. వైర‌స్ ను అంత‌మొందించేందుకు ఆయా దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ కూడా సిద్ధం చేశారు. అయితే.. వాటి ప్ర‌భావం ఎంత‌న్న‌ది మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే.. ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఓ ప‌రిశోధ‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాన్ని వెలువ‌రించింది. క‌రోనాకు జ‌లుబు వైర‌స్ తో చెక్ పెట్టొచ్చ‌ని తేల్చింది!

రైనో అనే వైర‌స్ జ‌లుబుకు కార‌ణం అవుతుంది. ఆ వైర‌స్ కు, క‌రోనా వైర‌స్ కు పోటీపెట్టారు శాస్త్ర‌వేత్త‌లు. అయితే.. ఈ పోటీలో జ‌లుబు వైర‌స్ నెగ్గ‌డం విశేషం. ఈ రెండు వైర‌స్ లూ మ‌నిషి శ్వాస‌కోశంపై దాడిచేస్తాయ‌ని తెలిసిందే. ఇందుకోసం శాస్త్ర‌వేత్త‌లు శ్వాస‌కోశ క‌ణ‌జాలాన్ని సిద్ధంచేసి, దానిపై ఈ రెండు వైర‌స్ ల ను వ‌దిలారు.

ఈ క‌ణ‌జాలాన్ని దెబ్బ‌తీసేందుకు ఈ రెండు వైర‌స్ లు పోటీప‌డ‌గా.. ఇందులో జ‌లుబు వైర‌స్ విజ‌యం సాధించింది. క‌ణ‌జాలాన్ని ముందుగా రైనో వైర‌స్ దెబ్బ‌తీసింది. అయితే.. మ‌రోవిధంగానూ సైంటిస్టులు టెస్ట్ చేశారు. శ్వాస‌కోశ క‌ణ‌జాలంపై ముందుగా క‌రోనా వైర‌స్ ను వ‌దిలి ఒక రోజు మొత్తం దానికి అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత జ‌లుబు వైర‌స్ ను వ‌దిలారు. ఈ సారి కూడా రైనో వైర‌స్సే గెలిచింది. దీంతో.. జ‌లుబు వైర‌స్ ను క‌రోనా త‌ట్టుకోలేద‌ని నిపుణులు తేల్చారు.

అయితే.. జ‌లుబు కొంత‌కాల‌మే ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అది త‌గ్గిపోగానే.. మ‌ళ్లీ క‌రోనా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు శాస్త్రవేత్త‌లు. అయితే.. క‌రోనా నివార‌ణ‌కు కృషి చేస్తున్న ప‌రిశోధ‌న‌లకు ఈ అధ్య‌య‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు.