Begin typing your search above and press return to search.

సీఆర్ డీఏ రైతుల‌కు జ‌గ‌న్ హామీ!

By:  Tupaki Desk   |   4 July 2018 10:07 AM GMT
సీఆర్ డీఏ రైతుల‌కు జ‌గ‌న్ హామీ!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఏపీలో అవినీతి తీవ్ర‌స్థాయిలో పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు హయాంలో టీడీపీ నేత‌లు.....రాష్ట్ర‌వ్యాప్తంగా భూక‌బ్జాలు - భూ ఆక్ర‌మ‌ణ‌లు...ఇసుక దందాలకు య‌థేచ్ఛ‌గా పాల్ప‌డుతున్నారు. ఇక అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో చంద్ర‌బాబు చేప‌ట్టిన బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఏడాదికి మూడు పంట‌లు పండే ప‌చ్చ‌ని పొలాల‌ను బీడులుగా మార్చిన చంద్ర‌బాబుపై రైత‌న్న‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు.

అయిన‌ప్ప‌టికీ.....భ‌య‌పెట్టి...బెదిరించి....అధ‌కార దుర్వినియోగానికి పాల్ప‌డి దాదాపుగా 54 వేల ఎక‌రాల భూముల‌ను చంద్ర‌బాబు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇప్ప‌టికీ వాటిలో ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కుండా....చంద్ర‌బాబు తాత్సారం చేస్తున్నారు. ఒక‌వేళ‌ - భూమి ఇవ్వకుంటే లాండ్‌ అక్విజేషన్ కింద స్వచ్చందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని రైతుల‌ను బెదిరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో - సీఆర్ డీఏ ప‌రిధిలోని రైతులు దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప‌ర్య‌టిస్తోన్న ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత జ‌గ‌న్ ను వారు క‌లుసుకొని త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజ‌యంగా కొనసాగుతోంది. ఈ నేప‌థ్యంలో రాజధాని ప్రాంతంలోని పెనుమాక - ఉండవల్లి రైతులు...కుయ్యేరు వద్ద జగన్ ను కలిశారు. ల్యాండ్‌ పూలింగ్ పేరుతో త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని, ఇప్పటికే 54 వేల ఎకరాలు బ‌ల‌వంతంగా లాక్కున్నారని రైతులు జ‌గ‌న్ కు విన్న‌వించారు. ఒక‌వేళ‌ - భూమి ఇవ్వకుంటే లాండ్‌ అక్విజేషన్ కింద తీసుకుని స్వచ్చందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వాపోయారు. అంతేకాకుండా, తమకు రుణాలు - సబ్సిడీలు - నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 54 వేల ఎకరాల్లో ....రాజ‌ధాని నిర్మాణానికి కేవ‌లం 900 ఎకరాలు స‌రిపోతుంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఆ భూముల్లో నిర్మాణాలు చేప‌ట్ట‌కుండా....భూముల కోసం తమను వేధింపుల‌కు గురి చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. త‌మ‌కు న్యాయం చేస్తాన‌ని జగన్ హామి ఇచ్చారని, జ‌న‌నేత జ‌గ‌న్ పై తమకు నమ్మకముందని రైతులు పేర్కొన్నారు. మ‌రోవైపు, తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని జననేతకు గోపాలరావుపేట గ్రామస్తులు వివ‌రించారు. వైఎస్ హ‌యాంలో వేసిన తారు రోడ్డు పాడైనా...త‌మ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని వాపోయారు. కాగా, మాదిగలంతా వైఎస్‌ జగన్ వెంటే ఉంటారని మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మడికి కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని జగన్ కు వినతిపత్రం ఇచ్చారు.