Begin typing your search above and press return to search.

నోటీసులు ఇచ్చే వ‌ర‌కూ తెచ్చుకున్న బాబు!

By:  Tupaki Desk   |   28 Jun 2019 5:41 AM GMT
నోటీసులు ఇచ్చే వ‌ర‌కూ తెచ్చుకున్న బాబు!
X
ప‌రువు పోగొట్టుకోవ‌టం ఎలా అన్న విష‌యంలో ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఉన్నంత టాలెంట్ మ‌రెవ‌రికీ ఉండ‌దేమో? త‌న‌కు మించిన రాజ‌కీయ అనుభ‌వం మరెవ‌రికి ఉండ‌ద‌న్న‌ట్లుగా బిల్డ‌ప్ లు ఇచ్చే ఆయ‌న‌.. ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇచ్చేందుకు వీలుగా త‌న వైపు నుంచి ఎలాంటి త‌ప్పులు ఉండ‌కూడ‌ద‌న్న ప్రాథ‌మిక విష‌యాల్ని కూడా ఆయ‌న ఎందుకు ప‌ట్టించుకోరో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల్సిన దానికి భిన్నంగా బాబు త‌ప్పులు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. అలాంటి త‌ప్పులు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అందుకు ప‌రిష్కారాల విష‌యంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌టం మ‌రో ఎత్తు. త‌మ హ‌యాంలో నిర్మించిన ప్ర‌జావేదిక నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని తేలి.. దాన్ని కూల్చేస్తున్న వేళ‌.. క‌నీసం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. తాను అద్దెకు ఉన్న ఇల్లు కూడా రూల్స్ ను బ్రేక్ చేసి నిర్మించింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రువు పోతున్న ప‌రిస్థితి.

ఇలాంట‌ప్పుడు స‌ద‌రు ఇంటిని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేస్తే బాగుండేది. నేటికి ఖాళీ చేయ‌ని బాబు తీరు ఇప్పుడు త‌ప్పు ప‌ట్టేలా మారింది. అక్ర‌మ క‌ట్ట‌డాల విష‌యంలో తాముక‌ర‌కుగా ఉంటామ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే చేత‌ల్లో చేసి చూపించిన జ‌గ‌న్‌.. క‌ర‌క‌ట్ట మీద ఉన్న నిర్మాణాల‌కు వ‌రుస పెట్టి నోటీసులు ఇవ్వ‌నున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఒక బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు.

క‌ర‌క‌ట్ట మీద ఉన్న నిర్మాణాల్లో అనుమ‌తి లేని వాటిని ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా కూల్చివేసుకోవాల‌ని తేల్చి చెప్పారు. లేనిప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే కూల్చివేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా బాబు అద్దె నివాసానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇంటికి సంబంధించిన యాజ‌మాన్య బాధ్య‌త‌లు బాబుకు ఉండ‌న‌ప్ప‌టికి.. అక్ర‌మ నిర్మాణంలో నివాసం ఉన్న నేప‌థ్యంలో కూల్చివేత నోటీసులు ఇవ్వ‌టం ద్వారా.. ఆయ‌న ఖాళీ చేయాల్సిన అంశాన్ని చెప్పేసిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక అక్ర‌మ నిర్మాణంలో బాబు కొన‌సాగ‌టం క‌రెక్ట్ కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. కొద్దిసేప‌టి క్రితం సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ న‌రేంద‌ర్ రెడ్డి బాబు నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. ఇల్లు ఖాళీ చేయించి ప‌డ‌గొట్టాల‌ని.. లేనిప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే కూల్చివేస్తుంద‌ని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసుల్లో తెలిపిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త లింగ‌మేని ర‌మేశ్ అతిథి గృహానికి కొన్ని మార్పులు చేసుకొని చంద్ర‌బాబు అద్దెకు ఉంటున్న సంగ‌తి తెలిసిందే.