Begin typing your search above and press return to search.
బాబు సర్కారుపై విమర్శలా? నోటీసులు పక్కా?
By: Tupaki Desk | 2 May 2017 9:18 AM GMTఏ చిన్న విమర్శల్ని ఏపీ సర్కారు తట్టుకోలేకపోతుందా? తప్పుల్ని ఎత్తి చూపుతున్న వారిపై బాబు సర్కారు అసహనం వ్యక్తం చేస్తుందా? తమను విమర్శించే వారి మాటల్లో నిజాన్ని చూసేందుకు ఏపీ అధికారపక్షం అస్సలు ఇష్టపడటం లేదా? తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న వారిని నోటీసులకు చెక్ చెప్పాలని చూస్తాందా? లాంటి సందేహాల్ని వ్యక్తం చేసేలా ఏపీ సర్కారు తీరు కనిపిస్తోందన్న మాటను పలువురు నోట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇలాంటి భావన కలగటం ఖాయం. ఏపీ సర్కారుపైన సంచలన విమర్శలు చేశారు ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కంపెనీల్లో ఒకటైన జపాన్ కు చెందిన మకీ అసోసియేట్స్ ఛైర్మన్ పుమిహికో. ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావటంపై ఏపీ సర్కారు సీరియస్ అయ్యింది.
ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిన మకీ అసోసియేట్స్ ఛైర్మన్ తో పాటు.. ఆ సంస్థకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ లో చెత్తపాలన సాగుతోందని.. ప్రతి విషయంలోనూ రాజకీయ జోక్యం ఉంటుందని.. సీఆర్ డీఏను స్వతంత్రంగా పని చేయనివ్వటం లేదంటూ వ్యాఖ్యానించటం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ కు రాసిన ఒక వ్యాసంలో పుమిహికో ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేశారు. ఇండియన్ ఆర్కిటెక్చురల్ ప్రొఫెషన్స్ ప్రతిష్ఠను ఏపీ సర్కారు పణంగా పెట్టిందని తీవ్రంగా మండిపడిన ఆయన.. వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవటానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలించారంటూ జపాన్ కంపెనీ ‘మకీ అసోసియేట్స్’కు సీఆర్ డీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత ఏమాత్రం లేదంటూ.. అప్పట్లో డిజైన్ కాంట్రాక్టు దక్కించుకున్న ఈ జపాన్ సంస్థ ఛైర్మన్ వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు అనుసరించిన తీరుతో భారత్‌లో పని చేసేందుకు అంతర్జాతీయ అర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్ గర్గ్ కు లేఖ రాశారు. ఈ వ్యవహారాలపై సీరియస్ అయిన ఏపీ సర్కారు.. తాజాగా సదరు సంస్థకు..ఆ సంస్థ ఛైర్మన్‌కు నోటీసులు పంపారు. మరి.. దీనిపై మకీ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/