Begin typing your search above and press return to search.
ముస్లిం శవాలను కాల్చేయడమే బెస్ట్: ఎంపీ
By: Tupaki Desk | 1 March 2017 7:53 AM GMTఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ఖబరస్థాన్-సంస్థాన్ వ్యాఖ్యల దూమారం మరువకముందే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వాటికి కొనసాగింపుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఖననాలకు సరిపడా భూమి లేనందున ముస్లింలు కూడా దహన సంస్కారాలకు సిద్ధపడాలని సూచించారు. యూపీలోని ఉన్నావ్‌లో జరిగిన సభ లో మహరాజ్ మాట్లాడుతూ.. "సంస్థాన్ లేదా ఖబరస్థాన్ పేర్లు ఏవైనా ఎవరినీ ఖననం చేయాల్సి అవసరం లేదు. దేశంలో రెండు నుంచి రెండున్నకోట్ల మంది హిందూ సాధువులున్నారు. వారు చనిపోయిన తర్వాత వారికో స్మారకం కావాలి. అందుకు భూమి కావాలి. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలున్నారు. వారికి సమాధులు కావాలి. కానీ, భారతదేశంలో అంత భూమి లేదు" అని మహరాజ్ అన్నారు.వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన మహరాజ్ పై చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్, సీపీఐ నేత రాజా డిమాండ్ చేశారు.
గతంలో సైతం సాక్షి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నాలుగు వివాహాలు చేసుకొని 40 మందిని కంటున్న వారే దేశంలో జనాభా విస్పోటనానికి బాధ్యత వహించాలని మహరాజ్ గతంలో అన్నారు. ‘దేశంలో జనాభా పెరుగుదలకు నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు ఉన్నవారే బాధ్యులు. జనాభా పెరుగుదలకు హిందువులు కారణం కాదు. జనాభా పెరుగుదలను నిజంగా నియంత్రించాలని మనం కోరుకుంటే ఈ దేశంలో కఠినమైన చట్టాలను తీసుకురావలసిన అవసరం ఉంది. పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది’ అని ఉన్నావ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సాక్షి మహరాజ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గతంలో దుమారం లేపాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/