Begin typing your search above and press return to search.

తెలంగాణ రైతుల కోసం ఏపీలో మ్యాచ్?

By:  Tupaki Desk   |   12 Oct 2015 10:51 AM GMT
తెలంగాణ రైతుల కోసం ఏపీలో మ్యాచ్?
X
రాష్ట్ర విభజన తర్వాత.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా ఏర్పడటం.. ప్రతి విషయంలోనూ.. ప్రతిఒక్కరి పనిని రెండు రాష్ట్రాల కోణంలో చూడటం ఇప్పుడో పనిగా మారింది. ఇది ప్రతిఒక్కరికి ఎంతోకొంత ఇబ్బందిని కలిగించే పరిస్థితి.

ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్ గతంలో మాదిరి హైదరాబాద్ లో నిర్వహిస్తే సరిపోవటం లేదు. తెలంగాణ రాజధాని కనిపిస్తుంది కానీ.. ఏపీ రాజధాని లేదంటే.. ఏపీలో మరే ప్రాంతం గుర్తుకు రాదా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. అదే సమయంలో ఏపీలో ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. ఓహ్.. ఏపీలో చేస్తారు కానీ తెలంగాణలో చేయరా? అన్న సందేహం పెద్ద సవాలుగా మారుతోంది.

దీంతో.. ప్రతి విషయానికి బ్యాలెన్స్ చేయలేక కిందామీదా పడిపోయే పరిస్థితి. తాజాగా క్రిసెంట్ క్రికెట్ కప్ వ్యవహారం చూస్తే ఇలాంటిదే కనిపిస్తుంది. ప్రతి ఏడాది సినీ తారలు ఏదో ఒక అంశంపై క్రికెట్ మ్యాచ్ నిర్వహించటం.. అందుకు వచ్చే డబ్బుతో ఏదైనా ఛారటీ కోసం వెచ్చించటం చేస్తుంటారు. 2011 నుంచి దీన్ని భారీగా నిర్వహిస్తున్నారు.

ఈ డిసెంబరు 13న విజయవాడలో నిర్వహిస్తున్న క్రిసెంట్ క్రికెట్ కప్ ను ఏపీలో ర్యాగింగ్ కల్చర్ పోవాలని.. దానికి వ్యతిరేకంగా ఈ కప్ ను నిర్వహిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ మ్యాచ్ ద్వారా సేకరించే నిధుల్లో రూ.5లక్షలు తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం వెచ్చించనున్నట్లు నిర్వాహకులు పేర్కొనటం గమనార్హం. అంటే.. విజయవాడలో నిర్వహించే మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ రైతుల సంక్షేమం కోసం వినియోగిస్తారన్న మాట అంటూ సీమాంధ్రులు పలువురు సా.. గదీస్తున్నారు.