Begin typing your search above and press return to search.
బుకీల భవిష్యత్ పై వ్యూహం: క‌్రికెటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు
By: Tupaki Desk | 21 April 2020 10:30 PM GMTప్రస్తుత లాక్ డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. వారు ఇంట్లో ఉండే మొత్తం మోసాలు - నేరాలు చేసేందుకు మంచి అదును లభించింది. ఈ క్రమంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాస్తవంగా ప్రపంచంలో అత్యధికంగా క్రికెట్ కు డిమాండ్ బాగా ఉంది. సాధారణ పరిస్థితుల్లోనే ఆ క్రికెట్ ను ఎంతోమంది క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు లాక్ డౌన్ వేళ అన్ని క్రికెట్ కార్యకలాపాలన్నీ రద్దు అయ్యాయి... మరికొన్ని వాయిదా పడ్డాయి. అయితే వారు మాత్రం భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి నుంచే తమ పని మొదలుపెట్టేశారంట. అయితే ఈసారి ఏకంగా క్రికెటర్లనే బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంట. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలన్నీ నిలిచి పోవడంతో క్రికెటర్లందరూ వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వారిని బుట్టలో వేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు వారి అభిమానులుగా ప్రవర్తిస్తూ వారితో బేరసారాలు చేస్తున్నట్లు - కొందరు బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం క్రికెటర్లను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏకంగా ఐసీసీ సంచలనాత్మక విషయం వెల్లడించింది. దీంతో యావత్తు క్రికెట్ ప్రపంచంతో పాటు క్రీడా రంగం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ వెల్లడించారు.
ప్రస్తుతం లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లు ఎక్కువసేపు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో అందుబాటులో ఉంటున్నారు. ఆ క్రమంలో క్రికెటర్లను బుకీలు టార్గెట్ చేసుకున్నారని వెల్లడించారు. క్రికెట్ స్తంభించిపోయినా బుకీలు క్రికెటర్లతో అభిమానుల పేరిట మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ వారితో బేరసారాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆ విధంగా సంబంధాన్ని పెంచుకుని ఫిక్సింగ్ చేయాలని యత్నిస్తున్నారంట.
భవిష్యత్తు లో మ్యాచ్ లు జరిగే సమయంలో వారిని వినియోగించుకుని ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్లందరికీ ఐసీసీ కీలక సూచనలు చేసింది. ఎవరైనా ఈవిధంగా ప్రయత్నాలు చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఐసీసీ కోరింది. అయితే ఈ విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది. భారత క్రికెటర్లను ఎవరైనా బుకీలు ప్రయత్నాలు చేస్తే వెంటనే తమకు తెలిపాలని క్రికెటర్లకు సూచించింది. బుకీల ప్రలోభాలాకు లొంగకూడదని సూచనలు చేసింది.