Begin typing your search above and press return to search.
క్రికెట్ మ్యాచ్ టికెట్ల తొక్కిసలాట.. వీరిపైనే కేసు నమోదు!
By: Tupaki Desk | 23 Sep 2022 4:08 AM GMTసెప్టెంబర్ 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్–ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.
జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఘటనలో అలియా (19) అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని ఆమె తల్లి విలపిస్తోంది. ఒక్కసారిగా గేటు తీయడంతో తోపులాట జరిగి.. అందరూ వచ్చి తన కుమార్తె మీద పడిపోయారని అలియా తల్లి తెలిపారు. దీంతో తన కుమార్తెను రక్షించండని పోలీసులను ప్రాధేయపడ్డానని వెల్లడించారు. పోలీసులు 10 నిమిషాల తర్వాత పాపను బయటకు తీసుకొచ్చారని.. తనకు తీవ్ర గాయాలయ్యాయని విలపించారు. తన కుమార్తెకు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అని, అందుకే మ్యాచ్ టికెట్ల కోసం గురువారం ఉదయం ఐదింటికే వచ్చామని తెలిపారు.
తన కుమార్తె అలియా చికిత్స కోసం తక్షణమే రూ.60 వేలు కట్టాలంటున్నారని వాపోయారు. దయచేసి తన కుమార్తెను ప్రభుత్వం కాపాడాలని విలపించారు. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఆద్య తల్లి మండిపడ్డారు.
మరోవైపు హైదరాబాద్‌లో జరగనున్న భారత్–ఆస్ట్రేలియా మధ్య టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం తీరుపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని విమర్శిస్తున్నారు. ఈ మేరకు అజారుద్దీన్, హెచ్‌సీఏ సభ్యులపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో అభిమానులు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు టికెట్లను బ్లాక్‌లో అమ్మారని ఆరోపణలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో అజారుద్దీన్, హెచ్‌సీఏ నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయించారు. ప్యారడైజ్ నుంచి జింఖానా వరకు అభిమానులు క్యూ కట్టారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెయిన్ గేట్ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా స్పృహ తప్పి పడిపోయారు. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. కాగా యువతులతో పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
టికెట్ల కోసం వచ్చినవారిని పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.