Begin typing your search above and press return to search.
సచిన్ కుమారుడికి.. తండ్రి పేరే అడ్డంకా?
By: Tupaki Desk | 5 Jun 2022 11:30 AM GMTభారత టెస్టు క్రికెట్ లో ఇప్పటివరకు దిగ్గజ బ్యాట్స్ మన్ లు అంటే సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. ఈ ముగ్గురూ టెస్టుల్లో పదివేల పరుగులు పైగా సాధించారు. వీరిలో ద్రవిడ్ మాత్రమే రిటైరయ్యాక బీసీసీఐతో అనుబంధం కొనసాగిస్తున్నాడు. గావస్కర్ కామెంటేటర్ గా, రైటర్ గా తన పని చూసుకుంటున్నాడు. సచిన్.. అసలు క్రికెట్ వ్యవహారాల్లో యాక్టివ్ గానే లేదు. తన సలహాలు, సూచనలు అవసరమైనప్పుడు మాత్రం దేశానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. గతంలో టీమిండియా కోచ్ ఎంపికలో తనవంతు పాత్ర పోషించాడు సచిన్.
దిగ్గజ బ్యాట్స్ మెన్ కుమారులు ఇలా అయ్యారే? 1970, 80ల్లో సునీల్ గావస్కర్ చూపిన ప్రతిభ అసామాన్యం. భీకర వెస్టిండీస్ బౌలర్లను తలచుకుంటేనే బ్యాట్స్ మెన్ వణికిపోయే రోజులవి. అలాంటి సమయంలో క్రీజులోకి వెళ్లాలంటేనే గజగజలాడేవారు. కానీ, సునీల్ గావస్కర్ హెల్మెట్ కూడా లేకుండా వారిని ఎదుర్కొన్నాడు. అది కూడా వెస్టిండీస్ గడ్డపై. వీరినే కాదు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పేసర్లనూ గావస్కర్ సమర్థంగా ఆడాడు.
కానీ, అతడి కుమారుడు రోహాన్ గావస్కర్ మాత్రం ఆ స్థాయికి ఎదగలేకపోయాడు. క్రికెటర్ గా సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన రోహాన్.. భారత్ కు 11 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 18.87 సగటుతో 151 పరుగులు సాధించాడు. వీటిలో ఓ అర్ధ శతకం (54) కూడా ఉంది. బౌలింగ్ లో ఓ వికెట్ పడగొట్టాడు. అయితే, కెరీర్ అంతా.. ముంబై నుంచి కాకుండా రంజీల్లో బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించాడు రోహాన్. ఎడమచేతి వాటం బ్యాటింగ్, ఎడమ చేతి వాటం స్పిన్ తో ప్రామిసింగ్ ఆటగాడిగానే పేరు తెచ్చుకున్నా.. ఎందుకనో దానిని నిలుపుకోలేకపోయాడు. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 181 ఇన్నింగ్స్ లాడి 24 సెంచరీలు కొట్టిన రోహాన్.. మొత్తం 6,938 పరుగులు సాధించాడు. 212 అతడి అత్యధిక స్కోరు. 44.19 సగటు. కానీ, అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ముద్ర చూపలేకపోయాడు. అన్నట్లు.. రోహాన్ మేనమామ ఎవరో కాదు.. మరో మేటి బ్యాట్స్ మన్ గుండప్ప విశ్వనాథ్. అయినా, రోహాన్ ప్రతిభ దేశవాళీ స్థాయికే సరిపోయింది.
అర్జున్ టెండూల్కర్ కూ అదే పరిస్థితి.. గావస్కర్ ను మించి భారత క్రికెట్ దేవుడిగా ఎదిగాడు సచిన్ టెండూల్కర్. మరెవరికీ సాధ్యం కానంతగా 200 టెస్టులాడిన సచిన్ గురించి ఎవరేం చెప్పినా తక్కువే. అయితే, సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాడు. అర్జున్ ను ముంబై క్రికెట్ లో ప్రోత్సహించాలని సచిన్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే.
అతడు అండర్ 19 జాతీయ జట్టుకూ ఎంపికయ్యాడు. వాస్తవానికి సచిన్ తన కుమారుడిని క్రికెటర్ చేద్దామనే ఉద్దేశంలో, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఎడమ చేతి పేస్ బౌలింగ్, బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ గా తయారు చేశాడు. కానీ, అర్జున్ టాలెంట్ ఇంకా ముంబై రంజీ జట్టులో చోటుకే సరిపోలేదు.
అంతెందుకు..? ఐపీఎల్ 2022లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రూ.30 లక్షలతో కొనుగోలు చేసిన ముంబై ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక గొప్ప క్రికెటర్ తనయుడు కావడం.. ముంబై ఇండియన్స్‌తో తండ్రికున్న అనుబంధం అతన్ని జట్టులోకి తీసుకునేలా చేసిందనే వ్యాఖ్యలు వచ్చాయి. ఇదే కాదు.. గతంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో అర్జున్ తో బౌలింగ్ వేయించడమూ విమర్శలకు తావిచ్చింది.
తండ్రి పేరు అడ్డంకా..? ''అర్జున్ బౌలింగ్‌లో ఇంకా చాలా మెలకువలు నేర్చుకోవాలి.. ఇప్పుడు అతనిలో ఉన్న నైపుణ్యం ఏ మాత్రం సరిపోదు'' ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యాఖ్యలివి. దీన్నిబట్టే అర్జున్ ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. భారత్ లో ''తండ్రికి తగ్గ తనయుడు''అనేది సాధారణంగా అందరూ వాడే మాట.
ఏ రంగంలోనైనా తండ్రి సాధించిన ఘనతలు, రికార్డులు అందుకుంటే ఈ ఉపమానం చేస్తుంటారు. వాస్తవానికి ఇది సరికాదు. అందరూ తండ్రులు సాధించినంత ఘనతలు సాధించలేరు. దీనిని విస్మరించి పోలికలు తెస్తుండడంమతో సమస్య వస్తుంది. ఇక అర్జున్ టెండూల్కర్ విషయంలో నిజంగా దురదృష్టమే.. ఎందుకంటే తనతో సమానమైన.. తనకంటే తక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నారు. ''ఎంతైనా అవకాశమిస్తేనే కదా అతనిలో లోపాలు ఉన్నాయా లేదా అనేది తెలిసేది'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజం.. మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అర్జున్ టెండూల్కర్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''అర్జున్‌లో టెండూల్కర్ గురించి అంతా మాట్లాడుతున్నారు.. ఎందుకంటే అతను దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు కాబట్టి. అయితే అతన్ని అంతా సచిన్‌తో పోలుస్తున్నారు. అలా కాకుండా అర్జున్‌ను తన ఆటను ఆడనిస్తే మంచిది. అతనికి ఇంకా 22 ఏళ్లు మాత్రమే. ఒక క్రికెటర్‌గా రాణించడానికి ఇదే సరైన సమయం. తండ్రిలా అద్బుతాలు చేయకపోవచ్చు.. కానీ ఒక మంచి క్రికెటర్‌గా పేరు సంపాదించే అవకాశం ఉంటుంది.