Begin typing your search above and press return to search.
స్పోర్ట్స్ బైక్స్ కు క్రేజ్.. ధోనికి ఇష్టపడే బైక్ ఇదే
By: Tupaki Desk | 17 Sep 2021 11:30 PM GMTయూత్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టపడుతారు. రోడ్లపై రయ్..రయ్ అంటూ దూసుకెళ్లాలని వారు అనుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ బైక్స్‌కు బానే క్రేజ్ ఉంది. ఇక మన దేశంలో అయితే యమ క్రేజ్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ కాగా, ఆయన వాడిన బైక్ కూడా స్పోర్ట్స్ బైక్ కావడం గమనార్హం. సామాన్య యువత నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్పోర్ట్స్ బైక్‌ను ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే మార్కెట్‌లో వీటి అమ్మకాలు కూడా జోరుగానే ఉంటాయి.
ఈ క్రమంలోనే సరికొత్త మోడల్స్‌ను కూడా కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తుండగా, అవి బాగానే సేల్ అవుతున్నాయి. క్రికెటర్ ధోని కూడా స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టపడుతుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇష్టమైన బైక్ ఏంటో ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్‌పైన చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా ఆయన గ్యారేజీలో ఉండిపోతాయి. ‘కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, కవాసకి నింజా హెచ్2, డుకాటి 1098, సుజుకి హయబుస,హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్’ తదితర బైక్‌లు ధోని కలెక్షన్‌లో ఉన్నాయి.
మార్కెట్‌లోకి వచ్చే సరికొత్త మోడల్స్‌ను పరిశీలించి వాటిని కూడా ధోని కొనుగోలు చేస్తూ ఉంటాడని ఆయన అభిమానులు అంటున్నారు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం బైక్ లవరే. ఆయన వద్ద ఉన్న బైక్స్ అన్నీ కలిపి దాదాపుగా కోటిన్నర రూపాయల వరకు విలువ చేస్తాయని అంచానా. మరో బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ సైతం స్పోర్ట్స్ బైక్స్‌ను చాలా ఇష్టపడుతుంటాడు. షూటింగ్స్ లేని టైంలో బైక్స్ పైన లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్తుంటాడు. షాహిద్ ‘హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్, వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్’ బైక్స్ ఉండగా, కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ కూడా స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టపడుతారు. మన దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ బానే సేల్ అవుతున్నాయి. కాగా, బాగా పాపులర్ స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కవాసకి నింజా హెచ్2ఆర్ బైక్.. దీని ఇంజిన్ కెపాసిటి 998 సీసీ కాగా, ఇందులో ఆరు గేర్లు ఉంటాయి. దీని ధర సుమారు రూ.79 లక్షలు ఉంటుంది. మరో మోడల్ బైక్ బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్.. దీని ఇంజిన్ కెపాసిటీ 999 సీసీ కాగా దీని ధర రూ.42 లక్షలు. ఇకపోతే హోండా గోల్డ్‌వింగ్ మోడల్ ఇంజిన్ కెపాసిటీ 1,833 సీసీ కాగా, బైక్ బరువు 385 కేజీలు ఉంటుంది. దీని ధర రూ.37 లక్షల 75 వేలు. మరో మోడల్ బైక్ హార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ దీని ఇంజిన్ కెపాసిటీ 1,746 సీసీ కాగా దీని ధర రూ.30 లక్షలు.