Begin typing your search above and press return to search.

హనీట్రాప్‌ వలలో క్రికెటర్‌!

By:  Tupaki Desk   |   9 Nov 2022 1:30 AM GMT
హనీట్రాప్‌ వలలో క్రికెటర్‌!
X
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటీవల కాలంలో హనీట్రాప్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఉన్నతాధికారులు ఇలా పలువురిని హనీ ట్రాప్‌ పేరుతో మోసం చేస్తున్న కిలేడీలు, ముఠాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాలతో బాధితుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్నారు.

తాజాగా దేశవాళీ క్రికెటర్‌ ఒకరు హనీ ట్రాప్‌ వలలో చిక్కుకోవడం కలకలం రేపింది. ఆ క్రికెటర్‌ బలహీనతను లక్ష్యంగా చేసుకుని దుండగులు భారీగానే క్రికెటర్‌ నుంచి దండుకున్నట్టు సమాచారం.

ఈ ఘటన వివరాల్లోకెళ్తే... కోల్‌కతాలో ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జరుగుతోంది. దీని కోసం ఢిల్లీ క్రికెటర్‌ వైభవ్‌ కంద్‌పాల్‌ కోల్‌కతా వెళ్లాడు. ఈ క్రమంలో డేటింగ్‌ సైట్‌ ద్వారా క్రికెటర్‌ వైభవ్‌కు ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. అమ్మాయిలతో గడపొచ్చని చెప్పి అతడిని ఒక బస్టాండ్‌కు పిలిచారు. అక్కడ వైభవ్‌కు కొంతమంది యువతుల ఫొటోలను చూపారు.

వారిలో ఒకరితో ఎంజాయ్‌ చేయొచ్చని చెప్పి కోల్‌కతా నగరంలోని పలు ప్రాంతాలకు క్రికెటర్‌ వైభవ్‌ను తీసుకెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు నిందితుల్లో ఒకడు అభ్యంతరకర వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో వైభవ్‌ అతడికి రూ. 60 వేల వరకు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా అతడి మొబైల్‌ ఫోన్, బంగారు నగలను సైతం దుండగుల ముఠా దోచేసింది. దీంతో వైభవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు.. నిందితులు కోల్‌కతాకే చెందిన శుభంకర్‌ బిస్వాస్, రిషభ్‌ చంద్ర, శివ సింగ్‌లుగా గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేసి బారాసత్‌ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

క్రికెటర్‌ వైభవ్‌ నుంచే కాకుండా మరికొందరి నుంచి కూడా నిందితులు ఇలానే డబ్బును వసూలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ముంబై జట్టు గెలుచుకుంది. ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ను ముంబై మూడు వికెట్ల తేడాతో ఓడించి కప్‌ ఎగరేసుకుపోయింది. ఇక క్రికెటర్‌ వైభవ్‌ ఆడిన ఢిల్లీ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరుకుంది. ఒక్క పరుగు తేడాతో విదర్భపై ఓటమి పాలైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.