Begin typing your search above and press return to search.

సిలిండర్ పేలుడు.. క్రికెటర్ భార్యకు గాయాలు

By:  Tupaki Desk   |   1 April 2020 3:55 AM GMT
సిలిండర్ పేలుడు.. క్రికెటర్ భార్యకు గాయాలు
X
షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక క్రికెటర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటం ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా బడుగు.. బలహీన వర్గాల నివాసాల్లో అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలటాన్ని చూస్తాం. అందుకు భిన్నంగా ఒక అంతర్జాతీయ క్రికటర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటం ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదని చెప్పాలి.

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.ఈ ఘటనలో అతడి సతీమణి దేవశ్రీ బిస్వాన్ సంచిత గాయపడ్డారు. ఇంట్లో టీ చేసేందుకు వంటింట్లోకి వెళ్లిన ఆమె.. గ్యాస్ పొయ్యి ఆన్ చేసిన వెంటనే.. సిలిండర్ పేలుడు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. అనూహ్యంగా వ్యవహరించిన ఆమె ప్రాణాల్ని కాపాడుకున్నారు.

గ్యాస్ సిలిండర్ పేలిన వెంటనే.. స్పందించిన ఆమె.. ముఖానికి చేతలు అడ్డుగా పెట్టుకోవటం తో.. ఆమెకు పెను ప్రమాదం తప్పించింది. చేతులు ముఖానికి అడ్డు పెట్టుకోకుంటే ముఖం మొత్తం కాలిపోయేదని చెబుతున్నారు. ఈ ఉదంతంలో చేతులు.. కాళ్లకు కొన్నిగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఏమైనా ఒక ప్రముఖుడి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటం మాత్రం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. గ్యాస్ సిలిండర్ మీద కొత్త సందేహాలకు తెర తీసేలా ఈ ఉదంతం మారిందని చెప్పక తప్పదు.