Begin typing your search above and press return to search.
న్యూజిలాండ్ జట్టుకు తీరని లోటు.. రాస్ టేలర్ రిటైర్మెంట్
By: Tupaki Desk | 30 Dec 2021 4:30 PM GMTఅంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ క్రమం తప్పకుండా ఆడుతూ.. అన్నింటిలోనూ మంచి సగటుతో రాణిస్తూ.. మిడిలార్డర్ లో పెట్టని కోటలా నిలబడుతూ.. పరుగులు రాబడుతూ.. న్యూజిలాండ్ జట్టుకు పెద్ద అండగా ఉన్న రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత వేసవి సీజన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్ తో జరుగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తో జరిగే ఆరు వన్డేలే తనకు చివరివని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ టేలర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉందని టేలర్ పేర్కొన్నాడు. రాస్ రిటైర్మెంట్ తో కివీస్ దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోనుంది. 37 ఏళ్ల రాస్ టేలర్ 2006లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 110 టెస్టులాడాడు. 193 ఇన్నింగ్స్ లో 7,584 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 290 కాగా.. 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు బాదాడు. మొత్తమ్మీద అతడి సగటు 44.87. ఇక 233 వన్డేల్లో 217 ఇన్నింగ్స్ ఆడిన టేలర్ 8,581 పరుగులు చేశాడు.
అత్యధిక స్కోరు 181 నాటౌట్. 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు కొట్టాడు. సగటు 48.20 కావడం విశేషం. ఇక 102 టీ20 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 1909 పరుగులు చేశాడు. 7 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా, అంతర్జాతీయ ఫార్మాట్ లో మూడు ఫార్మాట్లలోనూ మెరుగైన సగటున్న రాస్ టేలర్ గత పదేళ్లుగా కివీస్ విజయ ప్రస్థానంలో కీలకంగా నిలిచాడు. 2015, 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరిన జట్టులో సభ్యుడు. 2019 టెస్టు చాంపియన్ షిప్ గెలిచిన జట్టులోనూ టేలర్ భాగస్వామి. పలుకీలక మ్యాచ్ ల్లో రాణంచి కివీస్ కు గొప్ప విజయాలనందించాడు.
విలియమ్సన్ కు నమ్మకమైన భాగస్వామి న్యూజిలాండ్ జట్టు చరిత్రలో మెకల్లమ్ వంటి ఒకరిద్దరు తప్ప ఓపెనర్లది సాధారణ స్థాయే. భారమంతా ఎప్పుడూ మిడిలార్డర్ దే. అలాంటి మిడిలార్డర్లో టేలర్ పదేళ్లుగా కీలకంగా నిలుస్తున్నాడు. అతడి సగటు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అంతేకాక.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు బ్యాటింగ్ లో నమ్మకమైన భాగస్వామి. అవసరాన్ని బట్టి బ్యాటింగ్ లో గేర్ మార్చే టేలర్.. భారీ షాట్లకు పేరుగాంచాడు. టెస్టుల్లో ఎంత సహనంగా బ్యాటింగ్ చేయగలడో.. వన్డేలు, టి20ల్లో దుమ్మురేపగలడు.కేన్ తో కలిసి ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు.
టేలర్ కొంత కాలం న్యూజిలాండ్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2006 మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్ ప్రస్థానం మొదలైంది. అదే ఏడాది డిసెంబర్ 22న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. 2007లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2007లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టేలర్ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టేలర్ ఐపీఎల్ కూడా ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 1017 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్: 81 పరుగులు.