Begin typing your search above and press return to search.
వచ్చేవారం ఇంటికే.. టైటిల్ గెలిచే సీన్ టీమిండియా లేదట?
By: Tupaki Desk | 29 Oct 2022 7:30 AM GMTపాకిస్తాన్ ను తొలి మ్యాచ్ లో ఓడించిన టీమిండియాపై ఇంటా బయట ప్రశంసలు కురుస్తుంటే దాన్ని తట్టుకోలేని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్ చేతిలో ఓడి.. చివరకు జింబాబ్వే చేతిలోనూ మట్టికరిచిన పాకిస్తాన్ జట్టును వెనకేసుకురావడానికి టీమిండియాను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు స్టార్ పేసర్ షోయాబ్ అక్తర్ భారత్ విజయాలను సహించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు.
టోర్నీలో రెండు వరుస విజయాలను దక్కించుకున్న టీమిండియాకు టైటిల్ గెలిచే సీన్ లేదని.. సెమీస్ లో ఓడి ఇంటిదారి పడుతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ టీం బాగాలేదని.. వాళ్ల ఆటతీరు కూడా అంతేనని.. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీంను సెలక్ట్ చేసి యావరేజ్ ఆట ఆడిస్తే.. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఆడిపోసుకున్నాడు. అయితే పాకిస్తాన్ టీం.. సూపర్ 12 రౌండ్ నుంచి ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించానని తెలిపారు.
టీమిండియా కూడా మరో వారం ఆడుతుందని.. వాళ్లు కూడా వచ్చేవారం ఇంటికి వచ్చేస్తారంటూ షోయాబ్ అక్తర్ భారత్ పై తన అక్కసు వెళ్లగక్కాడు. సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోవడం పక్కా అని స్పష్టం చేశఆరు. ఎందుకంటే వాళ్లేం తోపు ఆటగాళ్లు కాదు.. పాకిస్తాన్ టీం ఎలాగైతే యావరేజ్ గా ఉందో టీమిండియా కూడా అంతే.. అయితే మన టీం, వాళ్లకంటే చెత్తగా ఉంది అంతే.. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఈ రెండు జట్లకు లేదు అని స్పష్టం చేశారు.
ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు? పాక్ కు ఓ చెత్త కెప్టెన్ దొరికాడు.. రెండో గేమ్ లోనే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.. మరీ జింబాబ్వే చేతిలో ఓడిపోతామని మాత్రం ఎవరూ ఊహించలేదంటూ షోయాబ్ పాక్ టీంపై నిప్పులు చెరిగారు.
ఇక షాహీన్ ఆఫ్రిది ఫిట్ గా ఉన్నాడా? ఫిట్ గా లేకపోయినా ఆడించారా? అంటూ ప్రశ్నించాడు. మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్ ను ఎలా వాడుకోవాలో కూడా తెలియదన్నాడు. ఫకార్ జమాన్ ను రిజర్వ్ బెంచ్ లో కూర్చుండబెట్టి పెద్ద తప్పు చేస్తున్నారని విమర్శించారు. అతడిలాంటి బ్యాటర్ ఆస్ట్రేలియాలో బాగా ఆడుతాడని.. ఇంత చెత్తగా ఆడితే జనాలకు ఎలా ముఖం చూపించగలరని షోయాబ్ మండిపడ్డారు. ఓ ప్లాన్ లేదు.. మిడిల్ ఆర్డర్ లేదు.. ఓపెనర్లు లేరని అక్తర్ నిప్పులు చెరిగారు.
మెగాటోర్నీలో పాక్ ను చిత్తు చేసిన భారత్ ఆ తర్వాత నెదర్లాండ్ పై కూడా గెలిచింది. మిగిలిన మ్యాచులల్లో ఒక్క సౌతాఫ్రికాను గెలిస్తే ఇక బంగ్లా, జింబాబ్వేలు పెద్ద కష్టం కాదు. సో సఫారీలతో టీమిండియా గెలుపే సెమీస్ బెర్త్ ను ఖాయం చేస్తుంది. ఇంత ఈజీగానే భారత్ కు షెడ్యూల్ ఉంది. కానీ పాక్ బౌలర్ మాత్రం భారత్ సెమీస్ చేరదంటూ తన అక్కసు వెళ్లగక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.