Begin typing your search above and press return to search.

ఆడ‌వాళ్లు కాదు..మొగ‌వాళ్లే ఇంట్లో ఉండిపోవాలి!

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:20 PM GMT
ఆడ‌వాళ్లు కాదు..మొగ‌వాళ్లే ఇంట్లో ఉండిపోవాలి!
X
హైద‌రాబాద్‌ లో జ‌రిగిన దిశ దారుణ హ‌త్యోందంత దేశ‌ వ్యాప్తంగా ఎంద‌రినో క‌ల‌చివేస్తోంది. ప్రాంతాల‌కు అతీతంగా - పార్టీల‌తో - రాజ‌కీయాల‌తో - సంఘాల‌తో సంబంధం లేకుండా అనేక మంది నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు చ‌ట్టాల‌ను మార్చాల్సిన అంశం కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది. దీంతోపాటుగా మ‌హిళ‌లు రాత్రివేళల్లో బ‌య‌ట‌కు వెళ్లొద్దంటూ ప‌లువ‌రు సూచ‌న‌లు చేస్తున్నారు. అయితే, దిశ హ‌త్య ఉదంతం సంద‌ర్భంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న ఓ మ‌హిళ చేసిన డిమాండ్ ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నటాషా అనే నెటిజన్‌ ట్విటర్‌ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు ఈ చ‌ర్చ‌కు కార‌ణం. దిశ వంటి అత్యాచార ఘటనలపై నిరసన వ్యక్తం చేస్తూ... ‘ఆమె అత్యాచారానికి గురికాలేదు. అతడే ఆమెపై అత్యాచారం చేశాడు’ అనే ప్లకార్డును ప్ర‌ద‌ర్శించిన ఓ మ‌హిళ‌ ‘రాత్రి ఏడు దాటిన తర్వాత మహిళలు ఇంట్లోనే ఎందుకు ఉండాలి? అదే మగవాళ్లు ఇంట్లో ఉండవచ్చు కదా! `` అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. దీంతోపాటుగా ఆమె మ‌రిన్ని ప్ర‌శ్న‌లు వేశారు. `ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు అన్నయ్య‌ - తమ్ముడు - భ‌ర్త‌ లేదా ఎవరో ఒక మగాడు ఆఖ‌రికి పోలీసో - రక్షణగా ఉండాలి అంటారు. అసలు సమస్యే మ‌గ‌వాళ్లే కదా. మీరే ఇంట్లో ఉండండి. ఇక నుంచి రోజూ ఏడు గంటలకే మగవాళ్లు ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకోండి. అప్పుడే మహిళలు సురక్షితంగా ఉండగలుగుతారు.అప్పుడు ప్రపంచం హాయిగా ఉంటుంది` అంటూ నిన‌దించారు.

స‌హ‌జంగానే ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. ఆడ‌వారి భ‌ద్ర‌త గురించి ఉచిత స‌ల‌హాలు ఇచ్చేవారు ఈ త‌ర‌హా `మేమే స‌మ‌స్య‌కు మూల‌కార‌ణం అనే బుద్ధి తెచ్చుకొని వారిప‌ట్ల స‌భ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి` అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. నాటి నిర్భయ ఘటన నుంచి నేటి దిశ ఉదంతం దాకా బాధితురాలినే బాధ్యురాలిగా చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా అక్కసు వెళ్లగక్కడం కాదు...స‌మ‌స్య మూలాల‌ను గ‌మ‌నించండి అంటూ మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు.