Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. ఇలా దోచేస్తున్నారు..వాళ్లకు పండుగే

By:  Tupaki Desk   |   23 April 2020 8:00 AM IST
కరోనా వేళ.. ఇలా దోచేస్తున్నారు..వాళ్లకు పండుగే
X
కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. పిల్లా పాపలతో కాలం గడుపుతున్నారు. బయటకు వెళితే పోలీసులతోపాటు కరోనా భయం ఉండడంతో ఎవరూ గడప దాటడం లేదు. ఈ నేపథ్యంలో సమాజంలో నేరాల సంఖ్య భారీగా తగ్గడం విశేషం. కానీ ఖాళీగా ఉన్న సైబర్ మోసగాళ్లు మాత్రం ఇదే అదునుగా దోచుకుంటుండడం గమనార్హం. ఇలా నాణేనికి రెండు వైపులున్నా.. జనాలకు మాత్రం బొక్కపడుతోంది.

జాతీయ గణంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా నేరాల రేటు గణనీయంగా తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15వరకు 2574 కేసులు మాత్రమే నమోదయ్యాయయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 66 మాత్రమే వాస్తవానికి చాలా తీవ్రమైన నేరాలు. మిగిలినవి చిన్న నేరాలు.

హత్యలు - అత్యాచారాలు మరియు ఇతర తీవ్రమైన నేరాల సంఖ్య చాలా తక్కువ అని పోలీసులు అంటున్నారు. గత ఏడాది ఇదే కాలంలో 10579 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి కరోనా టైంలో కేసులు 80 శాతం తగ్గాయని ఇది చూపిస్తుంది.

కానీ ఆందోళనకరమైన విషయం ఏంటంటే లాక్డౌన్ లో ఆన్‌ లైన్ మోసాలు.. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. హ్యాకర్లు అంతా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉండడంతో అందరూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ ఖాతాల నుండి నిధులను తీసివేస్తున్నారు. ఈ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.