Begin typing your search above and press return to search.
మోదీ కేబినెట్ లో పేదోడు ఆయనే..
By: Tupaki Desk | 9 July 2016 7:54 AM GMT మోడీ మంత్రులంతా మిలియనీర్లేనట.. అంతేకాదు, మోడీ టీంలో క్రిమినల్ కేసులున్నవారు కూడా ఉన్నారట. తాజా మంత్రివర్గ విస్తరణతో మోడీ కేబినట్ లో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నవారు 24 మంది ఉన్నారని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. లోక్‌సభ - రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం చేసింది. దానిప్రకారం కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల సగటు ఆస్తి రూ. 8.73 కోట్లని - దీంతో మొత్తం మంత్రి వర్గం సగటు ఆస్తి రూ. 12.94 కోట్లకు చేరుకుందని ఆ సంస్థ తెలిపింది.
కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రుల్లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయిన ఎంజె అక్బర్ అత్యధికంగా రూ. 44.90 కోట్ల ఆస్తులను ప్రకటించగా - రాజస్థాన్ కు చెందిన రాజ్యసభ సభ్యులు పిపి చౌధరి (రూ.35.35 కోట్లు) - విజయ్ గోయల్ (రూ. 28.97 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అనిల్ మాధవ్ ధవే అందరికంటే తక్కువ ఆస్తిపరుడని తేలింది.
- కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన కొత్త మంత్రుల: రమేశ్ జిగజినాగి - పురుషోత్తమ్ ఖందూభాయ్ రూపాలా - అనుప్రియ సింగ్ పటేల్ - మహేంద్ర నాథ్ - ఫగన్ సింగ్ కులస్తే - రాజెన్ గోహిన్ - ఎస్ ఎస్ అహ్లూవాలియా - అర్జున్ రామ్ మేఘ్వాల్ - సిఆర్ చౌధరి - మన్ సుఖ్ భాయ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ - కృష్ణరాజ్
- మొత్తం 78మంది మంత్రుల్లో 30 కోట్లకు పైగా ఆస్తి ఉన్నవారు: 9
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ : రూ.113 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ : రూ.108 కోట్లు
- విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్: రూ.95 కోట్లు
- కొత్తగా కేంద్రమంత్రివర్గంలో చేరిన మంత్రుల్లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడయిన అనిల్ మాధవ్ దవే అందరికన్నా తక్కువగా రూ.60.97 లక్షల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
- కోటి కన్నా తక్కువ ఆస్తులున్నవారు: ఆరుగురు మాత్రమే
- కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారిలో క్రిమినల్ కేసులున్నవారు: ఏడుగురు
- మొత్తం మంత్రుల్లో క్రిమినల్ కేసులున్నవారు: 24