Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల నిందితులే అభ్యర్థులు

By:  Tupaki Desk   |   27 Oct 2020 3:00 PM GMT
బీహార్ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల నిందితులే అభ్యర్థులు
X
బిహార్ అంటేనే ఒకప్పుడు గుండాలు, రౌడీలు, బందిపోట్లకు అడ్డాగా ఉండేది. ఇప్పడిప్పుడే అవన్నీ తగ్గి కుదుటపడింది. అయితే బీహార్ ఎన్నికల్లో మాత్రం నేరచరితుల సంఖ్య తగ్గడం లేదు. ఎన్నికల ప్రక్రియపై డబ్బు, నేరగాళ్లు తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నారు. నేరగాళ్లు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు. పాలనపైనా పడుతోంది

తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే బయటపడింది. బిహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 3న జరుగనున్నాయి. రెండో విడతలో 94 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 34శాతం మంది అంటే 1463 మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని తాజాగా ఏడీఆర్ అనే సంస్థ నివేదించింది. గొడవ, హత్య, లైంగిక దాడికి సంబంధించిన కేసులు వారిపై ఉన్నాయని సంస్థ తెలిపింది.

బీహార్ రెండో విడత పోటీచేసే అభ్యర్థుల్లో 27శాతం మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 389 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో వీరికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో 502మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

14మంది బీఎస్పీ, 24మంది కాంగ్రెస్, 15మంది జేడీయూ అభ్యర్థులపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. 32మంది హత్యచేశారని.. వారిపై కేసులు ఉన్నాయి. 143మందిపై అంటెప్ట్ టు మర్డర్ కేసు ఉందని తెలిపింది.

ఇక అభ్యర్థులు ఆస్తుల వివరాలను కూడా ప్రకటించారు. 495మంది తాము కోటీశ్వరులు అని పేర్కొన్నారు. ముగ్గురు మాత్రం తమ వద్ద ఆస్తులు లేవని చెప్పారు.

ఇలా బీహార్ ఎన్నికల వేళ నేరచరితులు ఇంకా పోటీలోనే ఉన్నారు. నేర చరితులు ఎన్నికల్లో పోటీచేయకుండా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అమలవుతుందనేది వేచిచూడాలి.