Begin typing your search above and press return to search.
కమల్ వ్యాఖ్యలు.. రెండుగా చీలిన సమాజం
By: Tupaki Desk | 15 May 2019 4:15 AM GMTకమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలి హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అంటూ నోరుజారిన కమల్ హాసన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళనాడులోని అరవకుచ్చి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పార్టీలన్నీ రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఒక వర్గం వారు కమల్ హాసన్ కు మద్దతు తెలుపగా.. మరికొందరు కమల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
*కాంగ్రెస్ మద్దతు.. బీజేపీ ఫైర్
నాథూరాం గాడ్సేను హిందూ ఉగ్రవాదిగా అభివర్ణించిన కమల్ హాసన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలు - ముస్లిం పార్టీలు - మైనార్టీ సంఘాల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఇక బీజేపీ మాత్రం అగ్గిమీద గుగ్గిలమైంది. కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్వీని ఉపాధ్యాయ కోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీలోని పాటియాల కోర్టు ఈ మేరకు కమల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.ఇక కమల్ ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
*కమల్ కు అసద్ మద్దతు
కమల్ హాసన్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తెలిపారు. మహాత్మాగాంధీ లాంటి వ్యక్తిని చంపిన గాడ్సేను హంతకుడిగా అభివర్ణించక గొప్పవాడిగా ఎలా చిత్రీకరిస్తారని అసద్ ప్రశ్నించారు. హిందూ ఉగ్రవాదంపై రచ్చ చేస్తున్న వారు మహాత్మాగాంధీని ఎవరు చంపారో చెప్పాలని అసద్ ప్రశ్నించారు.
*2017లోనూ కమల్ ఇదే తీరు..
2017లో కూడా హిందూ తీవ్రవాదంపై కమల్ హాసన్ ఇలానే వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అప్పుడు ఆయన సినిమాను కూడా హిందుత్వావాదులు అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం ఆయన చేసి వ్యాఖ్యలు దుమారం రేపాయి.
*కమల్ వ్యాఖ్యలు.. రెండు వర్గాలుగా సమాజం..
ప్రస్తుతం కమల్ చేసిన వ్యాఖ్యలతో దేశంలో హిందూ అనుకూల - వ్యతిరేక గ్రూపులు విడిపోయి మాటల యుద్ధం చేస్తున్నాయి. కమల్ కు మద్దతుగా కాంగ్రెస్ - ముస్లిం సంఘాలు - పార్టీలు.. వ్యతిరేకంగా బీజేపీ - హిందుత్వ వాదులు చెలరేగిపోతున్నారు. తమిళనాడు మంత్రి రాజా అయితే కమల్ నాలుక కోయాలని ఫైర్ అయ్యారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అయితే గాడ్సేను తీవ్రవాది అంటే ఫర్వాలేదని.. హిందువుగా అభివర్నించడం తప్పు అని మండిపడ్డారు. ఇలా కమల్ చేసిన వ్యాఖ్యలు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.