Begin typing your search above and press return to search.
ముంచిన బోటు యజమాని..ఓ జనసేన నేత
By: Tupaki Desk | 19 Sep 2019 9:50 AM GMTగోదావరిలోని కచ్చలూరు వద్ద మునిగిన బోటు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాధం నింపింది. దాదాపు 47మంది వరకు చనిపోయిన ఈ ఉదంతంలో ముంచిన రాయల్ వశిష్ట బోటు యజమానిపై ఎన్నో కేసులున్న విషయం వెలుగుచూసింది. అతడు లాభాపేక్ష కోసమే ఇలా అక్రమంగా.. అనుమతి లేకుండా బోటును నడిపించి ఇంత మంది ప్రాణాలు తీశాడన్న సంగతి బయటపడింది.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై ఎన్నో కేసులున్నాయి.. 2009-2017 వరకు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల కబ్జా- తప్పుడు పత్రాలతో భూములు అమ్మిన కేసుల్లో నిందితుడు. ఇక గొడవలు - ప్రభుత్వ భూమిని కాజేసే కేసులోనూ వెంకటరమణ ఇరుక్కొని బెయిల్ పై బయటకు వచ్చాడు. 2012లో రాజమండ్రికి మకాం మార్చి ఈ బోటు వ్యాపారంలోకి దిగాడు. రాజమండ్రికి ఫ్యామిలిని మార్చి అక్కడ కేవీఆర్ ట్రావెల్స్ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. ఈ రెండింటికి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం.
కాగా 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ ప్రజాప్రతినిధితో దోస్తీకట్టి తన వ్యాపారానికి అడ్డుకాకుండా చూసుకున్నాడు. 2019 ఎన్నికల వేళ జనసేన క్రియాశీల కార్యకర్తగా ఆ పార్టీ తరుఫున ప్రచారం చేశాడు. ఇలా రాజకీయ అండదండలతో తన అక్రమ వ్యాపారాన్ని చేసి నిబంధనలకు విరుద్దంగా నడిపించి ఇంత మంది చావుకు కారణమయ్యాడు బోటు యజమాని వెంకటరమణ.