Begin typing your search above and press return to search.

కరోనాను ఖతం పట్టించే క్రిస్పర్ క్యాస్..ఎలా పని చేస్తుందంటే?

By:  Tupaki Desk   |   18 July 2021 1:30 PM GMT
కరోనాను ఖతం పట్టించే క్రిస్పర్ క్యాస్..ఎలా పని చేస్తుందంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఖతం పట్టించే టైం దగ్గరకు వచ్చేసినట్లేనని చెప్పాలి. తాజాగా సాగుతున్న పరిశోధనలు చివరి దశకు రావటం.. పూర్తిస్థాయిలో ఈ ప్రయోగం విజయవంతమైతే.. కరోనాను మానవాళికి దూరంగా తరిమి కొట్టే అవకాశం ఉంటుందని చెప్పాలి. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయటమే కాదు.. కోలేకోని రీతిలో దేశాల ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీయటమే కాదు.. వందల కోట్ల మంది జీవితాల్ని తీవ్రంగా ప్రభావాన్నిచూపించిన వైనం అందరికి తెలిసిందే. కొవిడ్ మహమ్మారి కారణంగా కోట్లాది మంది దాని బారిన పడి తీవ్ర అవస్థలకు గురైతే.. లక్షలాది మంది ప్రాణాలు విడిచిన వైనం తెలిసిందే.

ఆధునిక యుగంలో.. అందునా డిజిటల్ లోకి ప్రపంచం మారిన తర్వాత మానవాళి ఎదుర్కొన్న అతి పెద్ద సవాలుగా కరోనాను చెప్పక తప్పదు. కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా కారణంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నాయి. ఇలాంటి ఈ మహమ్మారిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పాలి. కరోనా ఎంట్రీ ఇచ్చి ఏడాదిన్నర అవుతున్న వేళ.. మరెంత కాలం ఈ మహమ్మారి మనుషుల్ని వణికిస్తుందో అర్థం కాని వేళ.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్వర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన కొత్త ఆశలకు జీవం పోస్తోంది. క్రిస్పర్ క్యాస్ సాంకేతికతతో కొవిడ్ ను ఖతం చేయొచ్చన్న వీరి ప్రయోగం పూర్తిస్థాయిలో పూర్తి అయితే.. కరోనాను సింఫుల్ గా పారదోల్చన్న మాట వినిపిస్తోంది.

ఇంతకీ క్రిస్పర్ క్యాస్ సాంకేతికత అంటే ఏమిటి?అదెలా పని చేస్తుంది? కరోనాకు ఎలా చుక్కలు చూపిస్తుంది? అన్న విషయాల్లోకి వెళితే.. మిగిలిన వైరస్ లకు కొవిడ్ వైరస్ లకు ఉన్న వ్యత్యాసం ఏమంటే.. వైరస్ లో అంతర్గతంగా జన్యు పదార్థం ఉండి.. దాని చుట్టూ కొన్ని ప్రోటీన్లు.. ఆపై కొవ్వు పదార్థంతో కూడిన పొర.. దానిపై స్పైక్ ప్రోటీన్లు ఉంటాయి. ఇప్పటివరకు రూపొందించిన వ్యాక్సిన్లు కానీ.. ఇతర యాంటీ వైరల్ మందులు కానీ వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ మీదా.. మరికొన్ని ఇతర ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగుతాయి.

ఇక్కడొచ్చే సమస్య ఏమంటే..కరోనా వైరస్ ఈ ప్రోటీన్లలో మార్పులు చేసుకొని.. కొత్త వేరియంట్ గా రూపాంతం చెందుతుంటుంది. దీంతో.. వ్యాక్సిన్లకు.. మందులకు అంతుచిక్కని రీతిలో సవాలు విసురుతోంది. దీంతో.. వైరస్ లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్సపై మెల్ బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఇందులో కీలక భాగస్వామ్యం మెల్‌బోర్న్‌ యూనివర్సి టీ ఇన్‌ఫెక్షన్‌ అండ్‌ ఇమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట్, పీటర్‌ మెకల్లమ్‌ కేన్సర్‌సెంటర్‌ శాస్త్రవేత్తలదే. వీరంతా ఉమ్మడిగా రూపొందించిన సాంకేతికతే.. ‘క్రిస్పర్ క్యాస్’. ఈ విధానాన్ని డెవలప్ చేసిన వారిలో ఇద్దరు మహిళలు కీలక భూమిక పోషించారు. వీరిద్దరు (మ్యానక్స్‌ప్లాంక్‌ యూనిట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్‌ చార్పింటర్, కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ దౌడ్నాలకు) 2020 రసాయన శాస్త్రంలో నోబుల్ ను సొంతం చేసుకున్నారు. అంత టాలెంట్ వీరి సొంతం.

ఇంతకీ ఈ కొత్త సాంకేతికత లక్ష్యం ఏమంటే.. వైరస్ లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్స విధానాన్ని వారు రూపొందిస్తున్నారు. మరింత వివరంగా చెప్పాలంటే.. ఈ భూమి మీద ఉండే జీవులన్నింటికి ఆధారం జన్యువులే. మనిషికి మెదడు ఎలాంటిదో ప్రతి కణానికి డీఎన్ఏ పదార్థం అలాంటిది. ఆ కణం ఏమిటి? దాని విధులు ఏమిటి? కణంలోని భాగాలు ఏయే పనులు చేయాలి? ఏం ఉత్పత్తి చేయాలి? ఎలా వ్యవహరించాలన్నది జన్యువులే చూసుకుంటాయి.

క్రిస్పర్ అనే వ్యవస్థ ద్వారా క్యాస్ 9 అనే ఎంజైమ్ ను దాని మీదకు సంధిస్తారు. దాని డీఎన్ఏను కత్తిరించటం.. అందులోని ఏదైనా భాగాన్నితొలగించటం.. మరేదైనా భాగాన్ని కలపటం చేస్తారు. వైరస్ లోని ఆర్ఎన్ఏను కట్ చేసే సాంకేతికతను రూపొందించారు. ప్రస్తుతానికి దీన్ని జంతువులపై ప్రయోగించనున్నారు. తద్వారా మనుషులపై ప్రయోగాలకు అనువైన విధానాన్ని రూపొందించొచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రయోగానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. ఇదొక్క కొవిడ్ 19 మీదనే కాదు.. పలు రకాల వైరస్ మీదా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.