Begin typing your search above and press return to search.
పుట్ బాల్ లో చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో !
By: Tupaki Desk | 2 Sep 2021 4:30 PM GMTఫుట్ బాల్ చరిత్రలో ఒక దేశం తరపున ఆడి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ బుధవారం రాత్రి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ కొట్టాడు. ఇది అతడి అంతర్జాతీయ కెరీర్‌లో 110, 111వ గోల్ కావడం గమనార్హం. ఈ రెండు గోల్స్‌తో పోర్చుగల్ ను 2-1తో గెలిపించడమే కాకుండా.. చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఫుట్ బాల్ గా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
1993 నుంచి 2006 వరకు ఇరాన్ తరపున ఆడిన అలీ దాయ్ 109 గోల్స్ చేశాడు. ఇటీవల యూరో కప్ 2020లో ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన క్రిస్టియానో రొనాల్డో, అలీ దాయ్ రికార్డును సమం చేశాడు. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు గోల్స్ చేయడం ద్వారా అలీదాయ్‌ను దాటేసి ఏకైక ఫుట్ బాలర్ గా నిలిచాడు. అంతర్జాతీయ గోల్స్ విషయంలో గతంలో కొంత గందరగోళం ఉన్నది. అయితే వాటిని ఫిఫా ఈ ఎండాకాలంలోనే సర్దుబాటు చేసింది. గత రికార్డులు అన్నీ పరిశీలించి అందరి గోల్స్‌ను లెక్కించింది.
ప్రస్తుతం ఫిఫా రికార్డుల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్ లలో 111 గోల్స్ తో టాపర్ గా ఉన్నాడు. ఇరాన్ కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్ లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్ లలో 89 గోల్స్ చేశాడు. మరోవైపు క్లబ్ మ్యాచ్ లలో కూడా అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరుతోనే ఉన్నది. ఇటీవలే జువెంటస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ కు మారిన రొనాల్డో యూరోపియన్ చాంపియన్ షిప్ లో 14, యూరో కప్ 21, వరల్డ్ కప్ లో 21 గోల్స్ తో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రొనాల్డో మొత్తం అంతర్జాతీయ గోల్స్ ఇలా వచ్చాయి.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ - 33 గోల్స్
యూరోపియన్ చాంపియన్ షిప్ క్వాలిఫయర్స్ - 31
అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు - 19
యూరోపియన్ చాంపియన్ షిప్ - 14
వరల్డ్ కప్ - 7
యూఈఎఫ్ ఏ నేషన్స్ లీగ్ - 5
కాన్ఫెడరేషన్ కప్ - 2
ఆటలోనే కాదు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ క్రిస్టియానో రోనాల్డో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అత్యధిక ఇన్‌స్టా ఫాలోయర్లు కలిగిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. ఇన్‌స్టాలో తాను చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి రూ.11.92 కోట్లు అందుకుంటున్నాడు.