Begin typing your search above and press return to search.
ఇతరుల భార్యలను అలా అంటావా.. అది నోరేనా? - దినేష్ కార్తీక్ పై విమర్శలు
By: Tupaki Desk | 3 July 2021 3:30 PM GMT'కాలు జారితే తీసుకోవచ్చుగానీ.. నోరు జారితే తీసుకోలేం' అని అంటారు పెద్దలు. ఇది ఎంత వాస్తవమో.. క్రికెటర్ దినేశ్ కార్తీ చేసిన కామెంట్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్యనే అఫీషియల్ గా కామెంటరీ బాక్సులోకి అడుగు పెట్టిన దినేష్.. తనదైన వ్యాఖ్యానంతో అందరినీ అలరించాడు. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో కామెంటరీ చేసి మెప్పించాడు కూడా.
అయితే.. లేటెస్ట్ గా ఇంగ్లండ్ - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కు కామెంట్రీ చెబుతూ.. కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్న పిల్లాడిలా బొక్కబోర్లా పడిపోయాడు. జోక్ పేలుస్తున్నానని తాను అనుకున్నాడు.. అది మహిళలపై కావడంతో రివర్స్ కొట్టింది. దీంతో.. సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. మరి, ఇంతకీ.. దినేష్ ఏమన్నాడో చూద్దాం.
బ్యాట్స్ మెన్ కు బ్యాట్ కు మధ్య ఉన్న రిలేషన్ గురించి తనదైన వ్యాఖ్యానం జోడించాడు టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్. ''చాలా మంది బ్యాట్స్ మెన్లు తమ బ్యాట్లను ఇష్టపడినట్టు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడుతుంటారు. ఆ బ్యాట్లు చుట్టుపక్కల ఉండే ఇతరుల భార్యల్లాంటివి'' అని అనేశాడు. దీంతో.. అడ్డంగా బుక్కైపోయాడు దినేష్ కార్తీక్.
ఇతరుల భార్యల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దినేష్ కార్తీక్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కామెంటరీ పేరుతో ఇష్టారీతిన మాట్లాడడం సబబు కాదని, ఓపెన్ గా సారీ చెప్పాలని అంటున్నారు.
దినేష్ కార్తీక్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసినవారు.. ఆ విషయాన్ని లాగిమరీ సెటైర్లు వేస్తున్నారు. ''నీ పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాన్ని.. కామెంటరీలో చెప్పావా?'' అని కామెంట్ చేశారు. దినేష్ కార్తీక్.. ఫస్ట్ వైఫ్ తో విడాకులు తీసుకున్నాడు. ఆమె మరో క్రికెటర్ మురళీ విజయ్ నే పెళ్లి చేసుకుంది. మరికొందరు.. వాట్సాప్ జోకులను నమ్ముకొని కామెంట్ చేస్తే.. బొక్కబోర్లా పడాల్సి వస్తుందని కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి.. దినేష్ కార్తీపై విమర్శల జడి కురుస్తోంది. మరి, దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.