Begin typing your search above and press return to search.
శకునం చెప్పే బల్లి కుడితిలో పడటం అంటే ఇదేనేమో మమత?
By: Tupaki Desk | 9 July 2022 12:30 PM GMTతృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండుగా పేరుంది. ఆ పెద్ద నోరుతోనే, ఆ వాగ్ధాటితోనే 1984 నుంచి రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పుతున్నారు. ఆరుసార్లు ఎంపీగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ తనదైన శైలిలో రాణించారంటే ఆ వాగ్దాటే కారణం. అయితే ఆ నోరే ఒక్కోసారి చిక్కులు కూడా తెచ్చిపెడుతుంది. మాట పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే అని సామెత. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత కూడా పుట్టింది.
అయితే.. ఈ విషయంలో అడ్డంగా బుక్కయ్యారు.. మమతా బెనర్జీ. పదేళ్ల క్రితం ఓ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న ఆమె.. పుస్తకం, భార్యను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదని.. ఇస్తే అవి తిరిగి రావంటూ ఒక ఆంగ్ల సామెతను ప్రస్తావించారు. అన్యాపదేశంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. పదేళ్లు గడిచాక.. ఇప్పుడు మరోసారి మమతా బెనర్జీ చేసిన అదే రకమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు.. మమత.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మమతా బెనర్జీ... మీ జ్ఞానం, మేధస్సు, భార్యను ఇతరులకు ఇవ్వకండి.. ఇస్తే తిరిగి మీ చేతికి రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నవ్వులాటకే ఆమె ఈ మాటలు అన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భార్య గురించి ఒక మహిళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాడిన భాష సరిగ్గా లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
స్కాలర్‌షిప్‌లకు కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు మమత తెలిపారు. ఈ సమయంలోనే విద్య, మేధస్సు, భార్యను ఇతరులకు ఇవ్వకండి.. ఇస్తే అవి తిరిగి వెనక్కి రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మహిళలను కించపరిచేలా మమతా వ్యాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.