Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌కు ఇదే ప‌నా? ఏ ఎండ‌కు ఆ గొడుగు?

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:30 AM GMT
టీఆర్ ఎస్‌కు ఇదే ప‌నా?  ఏ ఎండ‌కు ఆ గొడుగు?
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ గురించి.. ప‌లు విమ‌ర్శ‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విష‌యం లేక‌పో యినా.. సృష్టించి.. త‌మ త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ఎత్తుగ‌డ‌ల‌పై స‌ర్వత్రా విస్మ యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓట్ల కోసం.. ఏ ఎండకు ఆ గొడుగు .. అన్న సూత్రాన్ని టీఆర్ ఎస్ అనుస‌రిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఏ పార్టీ అయినా.. ఒక స్టాండ్ తీసుకుని దాని ప్ర‌కారం ముందుకు సాగాలి. పైగా అధికారంలో ఉన్న పార్టీ అయితే.. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాలి.

అయితే.. దీనికి భిన్నంగా తెలంగాణ అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే గుస‌గుస వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి.. ఈ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాలు అంద‌రికీ చికాకు కూడా పుట్టిస్తున్నా యి. అప్ప‌టి వ‌ర‌కు లేని సెంటిమెంట్లు ఒక్క‌సారిగా తెర‌మీదికి వ‌చ్చేస్తాయి.

అప్ప‌టి వ‌ర‌కు లేని సామాజిక వ‌ర్గాల‌పై ప్రేమ‌.. హ‌ఠాత్తుగా ఊడి ప‌డుతుంది. నిదులు వ‌ర‌ద‌లై పార‌తాయి.. మీడియా మైకులు ద‌ద్ద‌రిల్లి పోయేలా కామెంట్లు వ‌స్తాయి. ఇదంతా చూస్తే.. తెలంగాణ ప్ర‌జ‌ల ఏకైక‌.. ఆద‌రువు.. ఒక్క టీఆర్ ఎస్సే! అని పించేలా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

ఉదాహ‌ర‌ణ‌కు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ఏపీ స‌ర్కారుతో కీచులాట పెట్టుకున్నారు. విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తూ.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య సెంటిమెంటును ర‌గిలించి.. కేసీఆర్ కాబ‌ట్టి.. ఇలా చేస్తున్న‌డు! అనే కామెంట్ల‌ను ప్ర‌జ‌ల‌లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. ఇక‌, ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప పోరు స‌మ‌యంలో అప్ప‌టి వ‌ర‌కు గుర్తులేని.. గుర్తుకు కూడా రాని.. ద‌ళిత బంధు తెర‌మీదికి వ‌చ్చింది. నిత్యం ద‌ళిత జ‌పం.. అధికార పార్టీ నేత‌ల నోళ్ల నుంచి వినిపించింది. ఎక్క‌డా లేని నిధులు.. వ‌ర‌ద‌లై పారాయి. ఇలా.. టీఆర్ ఎస్ చేస్తున్న ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

ఇవ‌న్నీ ఎందుకు చేస్తున్నారంటే.. అందరూ చెబుతున్న మాట `ఓట్ల కోసం`. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి.. ఏదో ఒక విష‌యంపై బీజేపీతో కొట్లాట పెట్టుకోవ‌డం.. సెంటిమెంటును ర‌గ‌లించ‌డం.. ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది. అదేస‌మయంలో గ‌త ఏడాది ఎన్నిక‌లు చూస్తే.. అప్ప‌ట్లో..టీడీపీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. అదేవిధంగా ఏపీతో నూ పంచాయ‌తీ.. అది జ‌ల వివాదం కావొచ్చు..ఉద్యోగుల విభ‌జ‌న కావొచ్చు.. విద్యుత్ అంశం కావొచ్చు.. ఏదో ఒక పంచాయ‌తీ పెట్టుకుని.. అప్ప‌టికి పబ్బం గ‌డుపుకునే ప‌రిస్థితి ఉంది.

ఇక‌, పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌కం కాగానే.. యువ నాయ‌కుడు కావ‌డం.. రాజ‌కీయంగా ఫైర్ బ్రాండ్ కావ‌డంతో.. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఏమైనా డ్యామేజీ ఉంద‌ని అనుకున్నారో.. ఏమో.. వెంట‌నే.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు.

ఇక‌, ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ హుజూరాబాద్‌లో విజ‌యం ద‌క్కించుకున్నాడు. ఇది అంత మామూలు విజ‌యం కాదు. ఒక బ‌ల‌మైన అధికార పార్టీ.. విసిరిన సామ‌, దాన, భేద, దండోపాయ‌ల‌నే స‌వాళ్ల‌ను అధిగ‌మించి.. ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్న విజ‌యం.

అయితే.. ఈ విజయం ఎక్క‌డ హైలెట్ అవుతుందో అనే భావ‌న‌తో వెంట‌నే దీనికి స‌మాంత‌రంగా. . కొత్త విష‌యాన్ని త‌వ్వితీసి.. యాగీ చేయ‌డం.. అనుకూల మీడియాల్లో ప్ర‌చారం చేసుకోవ‌డం.. టీఆర్ ఎస్‌కు.. మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది. లేక‌పోతే.. కేసీఆర్ లేవ‌నెత్తి.. `వ‌రి` విష‌యం.. ఇప్పుడు కొత్త‌దా?; గ‌త ఏడాదిన్న‌ర కాలంగా మూలుగుతోంద‌ని.

ఆయ‌నే చెప్పాడు. కానీ, ఇప్పుడు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చాడు. ఇది ముమ్మాటికీ.. ఈట‌ల విజ‌యం తాలూకు.. అంశాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా చేయ‌డ‌మే.. అని మేధావులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.