Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ చేయొద్దని మెడలో ప్లకార్డుతో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు
By: Tupaki Desk | 13 Sep 2022 4:41 AM GMTనేరాలకు అడ్డాగా నిలిచే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో నేరాలకు.. ఘోరాలకు కొదవ ఉండదు. నేరాలు చేసే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యోగి సర్కారు.. కరుడుగట్టిన నేరస్తుల ఇళ్లను కూల్చేయటం.. అవసరమైతే వారిని ఎన్ కౌంటర్ లో లేపేయటం లాంటి వాటితో.. నేరగాళ్లకు వణుకు తెప్పిస్తోంది.
నేరాలకు పాల్పడితే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చి మరీ లేపేసే ముఖ్యమంత్రిగా సుపరిచితమైన యోగి ఎఫెక్టు ఇప్పుడా రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
తాజాగా ఘజియాబాద్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. యోగి సర్కారు ప్రభావం నేరస్తుల మీద ఎంత ఉందన్న విషయాన్ని తెలియజేసేలా మారింది.
ఈ నెల తొమ్మిదిన ఘజియాబాద్ లో ఒక హత్య జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. అవసరమైతే నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేస్తామని జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. హడలెత్తిన నిందితుడు సొహైల్.. మెడలో ప్లకార్డువేసుకొని మరీ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.
ఈ ప్లకార్డులో.. తనను ఎన్ కౌంటర్ చేయొద్దని.. తాను జీవితంలో మళ్లీ నేరాలు చేయనని పేర్కొన్నారు. తనను చంపొద్దంటూ పోలీసుల్నిరిక్వెస్టు చేస్తూ.. ప్లకార్డు మెడలో వేసుకొని మరీ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.