Begin typing your search above and press return to search.
కర్నూలు ఎంపీ సీటు.. క్రాస్ ఓటింగ్ - కుల సమీకరణాలు!
By: Tupaki Desk | 3 May 2019 4:38 AM GMTరాయలసీమ ప్రాంతంలో గత ఎన్నికలకు - ఈ సారి ఎన్నికలకూ సమీకరణాలు బాగా మారిన ఎంపీ సీటు కర్నూలు. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి కొద్దో గొప్పో ఓట్లు పొందిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఈ సారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. అనేక చర్చలు - బోలెడంత ప్రతిష్టంభన తర్వాత కోట్ల తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి ఒక దశలో అయితే తెలుగుదేశం పార్టీ పట్టుబట్టి మరీ ఆయనను తమ పార్టీలోకి తెచ్చుకుంది.
కోట్లను చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలానే కష్టపడ్డారు. ఖర్చులకు డబ్బులు వంటి హామీలు ఇచ్చారని అంటారు. కోట్ల తెలుగుదేశంపార్టీలోకి చేరడం పట్ల విముఖత వ్యక్తం చేసిన కేఈ కృష్ణమూర్తికి కూడా చంద్రబాబు నాయుడు సర్ధి చెప్పాడు. ఇద్దరికీ రాజీ చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు. ఎలాగోలా సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగారు.
అక్కడ నుంచి రకరకాల పరిణామాలు సంభవించాయి. ఎంపీ టికెట్ తనకు దక్కకపోవడం - కనీసం ఎక్కడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడంతో బుట్టా రేణుక తెలుగుదేశానికి రాజీనామా చేశారు. ఆమె తిరిగి వైఎస్సార్సీపీలోకి చేరిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కర్నూలు ఎంపీ సీటు నుంచి మరోసారి బీసీనే నిలబెట్టింది. అది కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీగా బరిలోకి దించింది.
ఈ నియోజకవర్గం పరిధిలో ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. ఇక ఎలాగూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషినల్ ఓటు బ్యాంకు ఉండనే ఉంది.
ఓవరాల్ గా ఇదీ పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీ ల మధ్యనే జరిగింది. కొంత వరకూ ఈ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. దశాబ్దాలుగా ఈ ఎంపీ సీటు పరిధిలోని ప్రాంతంలో వైరి వర్గాల వారిని కోట్ల - కేఈలు చేరదీస్తూ వచ్చారు. చెరో వర్గాన్ని ప్రతి చోటా పెంచి పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు కేఈ - కోట్ల పైకి రాజీ గా కనిపించారు కానీ.. రూరల్ లెవల్లో వారి రాజీ ఏ మేరకు జరిగి ఉంటుందనేది అనుమానమే.
ఇక కేఈ కుటుంబానికి ఆలూరు టికెట్ కేటాయించిన చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీ బీసీ నేతకు అన్యాయం చేశారనే అభిప్రాయం వినిపించింది. ఇలాంటి పరిణామాలు కూడా కర్నూలు ఎంపీ సీటు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందంతా రాయలసీమలో బీసీల పార్టీగా తెలుగుదేశానికి పేరు. అయితే వరసగా రెండో సారి బీసీకే ఎంపీ టికెట్ ఇచ్చింది వైఎస్సార్సీపీ. టీడీపీ మాత్రం కొత్తగా రెడ్డికి టికెట్ ఇచ్చింది. బీసీ ఓటు బ్యాంకు జనాభా రీత్యా చూస్తే తెలుగుదేశం పార్టీకి అంత మేలు చేసిన వ్యవహారంలా కనిపించడం లేదు అది. వైఎస్సార్సీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కు తోడు బీసీల ఓటు బ్యాంకు తోడై ఉంటే.. ఆ పార్టీనే కర్నూలులో మరోసారి జెండా పాతే అవకాశం ఉంది. ఆల్రెడీ కోట్లను - తెలుగుదేశం పార్టీని వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లోనే ఓడించింది. ఈ సారి వారిద్దరూ కలిసి వచ్చారు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మరి!