Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పేల్చిన బాంబు తుస్సుమని పోయిందే!
By: Tupaki Desk | 21 July 2017 4:58 PM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒక బాంబు పేల్చింది. కానీ ఆ బాంబు పేలిందో లేదో అర్థమయ్యే సమయానికి అది కాస్తా తుస్సుమన్నది. గుట్టుచప్పుడు కాకుండా, చాపకింద నీరులాగా తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరిగిపోతున్నదనే అర్థం ధ్వనించేలా... కాంగ్రెస్ నాయకులు ప్రయోగించిన చిన్న మైండ్ గేమ్ కూడా బెడిసి కొట్టింది. పేల్చిన బాంబు తుస్సుమని వారు నవ్వుల పాలయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటారా?
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణలోని అధికార తెరాస - కేంద్రంలో పాలన సాగిస్తున్న భాజపా అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు బేషరతు మద్దతు ప్రకటించింది. మోడీతో చాలా కాలంగా సత్సంబంధాలనే కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఓటింగ్ పద్ధతి గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మరీ.. ఓట్లు కోవింద్ కు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ ను మోహరించిన తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెరాసపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా , తెరాసకు ఇది ఒక మంచి రాజకీయేతర అవకాశం అని వారు రెచ్చగొట్టారు. పైగా మీరాకుమార్ స్పీకర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చట్టసభలో బిల్లు పాసైంది గనుక... ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలకమైన స్పీకరు స్థానంలో ఉండి మీరాకుమార్ సహకరించారు గనుక.. ఆమెకే మద్దతివ్వాలంటూ.. కాంగ్రెస్ వారు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు ప్రయత్నించారు. కేసీఆర్ దళం పట్టించుకోకపోయే సరికి మరో మైండ్ గేమ్ ఆడారు.
మీరా కుమార్ పట్ల గులాబీ పార్టీలోని కొందరిలో కృతజ్ఞత భావం ఉన్నదని వారంతా క్రాస్ ఓటింగ్ చేస్తారని బీరాలు పలికారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి అదంతా ఉత్తి ఊహా గానమే అని తేలిపోయింది. తెలంగాణలో కోవింద్ కు 97 ఓట్లు రాగా - మీరాకుమార్ కు కేవలం 20 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి కాంగ్రెస్ కు 13 - ఎంఐఎంకు 7 - సీపీఎంకు1 కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. పడింది మాత్రం 20 ఓట్లే. మరి ఏదో రాష్ట్రంలో తమ బలం పెరిగిపోయినట్లుగా, అపరిమితమైన స్వామిభక్తులు ఉండే గులాబీ పార్టీనుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందంటూ కాంగ్రెస్ పలికినవి ప్రగల్భాలే అని తేలింది.