Begin typing your search above and press return to search.

కర్ణాటక ముఖ్యమంత్రికి కాకి ఫోబియా

By:  Tupaki Desk   |   20 Jan 2017 10:48 AM GMT
కర్ణాటక ముఖ్యమంత్రికి కాకి ఫోబియా
X
దేశంలోని ముఖ్యమంత్రులందరిలోనూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చాలా డిఫరెంటు.. తరచూ ఆయన్ను వివాదలు చుట్టుముడుతుంటాయి. వాచీ గొడవ.. తాంత్రిక పూజల గొడవ వంటివన్నీ ఆయన్ను గతంలో వార్తల్లో నిలిపాయి. అంతేకాదు... కాకులు కూడా ఆయనపై పగబట్టాయని.. ఆయన కాకులను చూసి బెదిరిపోతున్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటికితోడు ఆయనకున్న నమ్మకాలు మరింతగా విమర్శలుపాలుజేస్తున్నాయి.

కొద్దిరోజుల కిందట సిద్ధరామయ్య కారుపై కూర్చుని ఓ కాకి చాలా హడావుడి చేసింది. దీన్ని అపశకునంగా భావించిన ఆయన... ఏకంగా కారునే మార్చేశారు. ఇప్పుడు తాజాగా ఓ కాకి ఆయనపై రెట్ట వేసింది. ఈ ఘటన కేరళలోని కాసరగోడు సమీపంలో ఉన్న మంజేశ్వర్ లో జరిగింది. ఈ ప్రాంతం మంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంజేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న సిద్ధరామయ్యపై కాకి రెట్ట వేసింది. ఆయన దుస్తులపై రెట్ట పడింది. వెంటనే పక్కనే ఉన ఓ ఎమ్మెల్యే ఆ రెట్టను తుడిచివేశారు. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ - మంత్రి రమానాథ రై కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాకిని తరిమివేశారు.

ఇదంతా కామన్ గానే కనిపించినా.. ఈ ఘటనపై సిద్ధరామయ్య స్పందన మాత్రం మళ్లీ విమర్శలకు దారితీస్తోంది. కాకిరెట్ట వేస్తే అక్కడితో వదిలేయాల్సిన ఈ చిన్న విషయంపై ఆయన చాలా ఆందోళన చెందుతున్నారట. వెంటనే ఆయన.. కాకి రెట్ట శుభ శకునమా? కాదా? అంటూ వేదికపై ఉన్న తన సహచరులను అడిగారట. అక్కడితో ఆగకుండా అక్కడి నుంచే తన పర్సనల్ సిద్ధాంతులను కాంటాక్ట్ చేసి మరీ ఏం కాదన్న నిర్ధారణకు వచ్చారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/