Begin typing your search above and press return to search.

కమాండెంట్ సూసైడ్.. నా భార్యకు శవాన్ని ఇవ్వొద్దని నోట్

By:  Tupaki Desk   |   10 Sept 2020 6:00 AM IST
కమాండెంట్ సూసైడ్.. నా భార్యకు శవాన్ని ఇవ్వొద్దని నోట్
X
జీవితంపై విరక్తి చెందిన ఓ సీఆర్పీఎఫ్ కమాండెంట్ విధుల్లో ఉన్న సమయంలో రైఫిల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగానే కమాండెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ‘నా శవాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకండి.. మీరే అంత్యక్రియలు చేయండి’ అంటూ అధికారులకు కమాండెంట్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

కేరళకు చెందిన శ్రీజన్ చెన్నైలోని పూండమల్లి సీఆర్పీఎఫ్ 7వ బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీజన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి నుంచి సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు వచ్చిన శ్రీజన్ మూడాఫ్ అయ్యి కనిపించాడు. ఉద్యోగులు పలకరించినా ఎవ్వరినీ విష్ చేయలేదు. తన రైఫిల్ తీసుకొని ఓ గదిలోకి వెళ్లాడు. అనంతరం తుపాకీతో కాల్చుకున్నాడు.

తోటి పోలీసులు ఆ గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. తన శవాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వవద్దని శ్రీజన్ సూసైడ్ లేఖలో కోరాడు. దీంతో కుటుంబ కలహాల కారణంగానే చనిపోయాడని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా విధులకు హాజరయ్యే ముందు శ్రీజన్ భార్యతో గొడవపడినట్టు తెలుస్తోంది.