Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: సీఆర్పీఎఫ్ కార్యాలయం మూసివేత
By: Tupaki Desk | 3 May 2020 9:10 AM GMTకరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలతో పాటు అత్యావసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న వారికి కూడా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది - ఆస్పత్రి ఉద్యోగులు - పోలీసులు - జర్నలిస్టులు - చివరకు సైనికులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. దీంతో దేశమంతా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్)కు కూడా కరోనా పాకింది.
తాజాగా సీఆర్పీఎఫ్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ విభాగం అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే హెడ్ క్వార్టర్స్ ను అధికారులు ఆదివారం సీలు వేసి మూసేశారు. శానిటేషన్ కోసం బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీలోని 31వ బెటాలియన్ కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఈ బెటాలియన్ కు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ ఇటీవల కరోనాతో మృతి చెందారు. సీఆర్ పీఎఫ్ అధికారితో పాటు జవాన్లకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవనంలో పరిశుభ్ర చర్యలు ముమ్మరం చేసి కరోనా జాడ లేకుండా చేయనున్నారు. శానిటైజైషన్ ప్రక్రియ పూర్తయ్యాక భవనాన్ని తిరిగి తెరిచే అవకాశం ఉంది.