Begin typing your search above and press return to search.
వెకిలి చేష్టలకు ఆ జవాను రియాక్ట్ కాలేదెందుకు?
By: Tupaki Desk | 20 April 2017 7:23 AM GMTఈ మధ్యన జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీశాయి. ఉప ఎన్నికల విధులు ముగించుకొని వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్‌ను అల్లరిమూకలు చట్టుముట్టటం..అతన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం.. కొట్టటం.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయాలని బలవంతం చేయటం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు. అక్కడి వారు అంతలా రెచ్చగొడుతున్నా.. తాను మాత్రం ఎలాంటి స్పందన లేకుండా తన పని తాను చేసుకుంటూ పోవటమే కాదు.. నరకయాతనను ఓర్పుతో.. సహనంతో భరించాడు.
చేతిలో తుపాకీ ఉన్నా.. ఎలాంటి టెంపర్ మెంట్స్ కు లోనుకానట్లుగా వ్యవహరించారు. సదరు జవాను విశ్వకర్మ హుందాతనాన్ని పలువురు అభినందిస్తూనే.. అల్లరిమూకల వికృత చేష్టలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా సదరు జవాను సెలవుల్లో భాగంగా తన స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా మీడియా అతన్ని కలిసింది. అంతలా రెచ్చగొట్టినా.. ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. దేశ క్షేమం కోసమే తాను ఆ సమయంలో స్పందించలేదన్నారు. తాను విధులను సక్రమంగా నిర్వర్తించానని.. తమను తాము రక్షించుకొని దేశ ప్రయోజనాల్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని.. అందుకే ఆ సమయంలో తాను సంయమనంతో వ్యవహరించినట్లుగా చెప్పుకొచ్చాడు.
తాము రాళ్లు విసిరే వారిని చూసి భయపడమని.. పాకిస్థాన్ జిందాబాద్.. గో ఇండియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. తమను రెచ్చగొట్టాలని చూసే వారి పట్ల నిగ్రహంగా వ్యవహరిస్తూ.. తమ విధులను నిర్వర్తిస్తామని వ్యాఖ్యానించాడు. తన కొడుకు విశ్వకర్మ విధులు నిర్వహించిన తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆనందానికి గురి కావటమే కాదు.. చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/